బిజినెస్

శ్యాంసంగ్ నుంచి గెలాక్సీ సి-9ప్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జనవరి 19: నాణ్యమైన ఎలక్రానిక్ వస్తువులను ఉత్పత్తి చేయడంలో అంతర్జాతీయంగా పేరెన్నికగన్న శ్యాంసంగ్ తన తాజా హ్యాండ్‌సెట్ ‘గెలాక్సీ సి-9ప్రో’ను గురువారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. 6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ (్ఫల్ హెచ్‌డి) ఎస్‌అమోలెడ్ డిస్‌ప్లే, 6 గిగాబైట్ల ర్యామ్, అధిక సామర్ధ్యం కలిగిన బ్యాటరీ, స్టోరేజీ సదుపాయం, ముందు, వెనుక 15 మెగాపిక్సెల్స్ సామర్ధ్యం కలిగిన కలిగిన కెమెరాలు, అత్యాధునిక ప్రాసెసర్ తదితర ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ స్మార్ట్ఫోన్ ధరను 39,600 రూపాయలుగా నిర్ణయించినట్లు శ్యాంసంగ్ ఇండియా మొబైల్ వ్యాపార విభాగం జనరల్ మేనేజర్ సుమిత్ వాలియా స్పష్టం చేశారు. ఎస్.సెక్యూర్, ఎస్.పవర్ ప్లానింగ్, అల్ట్రా డేటా సేవింగ్ (యుడిఎస్), మై గెలాక్సీ లాంటి ‘మేక్ ఫర్ ఇండియా’ ఫీచర్లను సపోర్టు చేసే ఈ హ్యాండ్‌సెట్ మల్టీమీడియాలో వినియోగదారులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని ఆయన చెప్పారు.

చిత్రం..‘గెలాక్సీ సి-9ప్రో’ను ఆవిష్కరిస్తున్న బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్