బిజినెస్

వౌలిక వసతులే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: డిజిటల్ ఎకానమీ పుంజుకోవాలంటే దేశంలో అద్భుతమైన వౌలిక సదుపాయాలు కల్పించాలని, వచ్చే కేంద్ర బడ్జెట్ కీలకమైనదని సియాంట్ ఫౌండర్ చైర్మన్, నాస్కామ్ పూర్వ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి అన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల డిజిటల్ ఎకానమీ వృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్థిక సంస్ధలు, చెల్లింపుల సంస్ధలు, కంపెనీలు సమిష్టి భాగస్వామ్యంతో పనిచేయాల్సి ఉందన్నారు. దేశంలో 700 మిలియన్ల డెబిట్ కార్డులు ఉన్నాయన్నారు. కాని 14.4 లక్షల ప్రదేశాల్లోనే ఈ కార్డులను అంగీకరిస్తున్నారన్నారు. దేశంలో 5.8 లక్షల చిన్న , పెద్ద తరహా పరిశ్రమలు ఉన్నాయన్నారు. మొత్తం వౌలిక సదుపాయాల వ్యవస్ధను అద్భుతంగా అభివృద్ధి చేసే డిజిటల్ ఏకనామీలోకి మారవచ్చన్నారు. కార్డుల చెల్లింపులపై స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమన్నారు. లావాదేవీలు రుసుములను ఎత్తివేయాలన్నారు. డిజిటల్ ఎకనామీలోకి వచ్చినందుకు ప్రజల నెత్తిన అడ్డగోలుగా రుసుములను బాదరాదన్నారు. డిజిటల్ చెల్లింపులకు మారేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. పన్ను మాఫీలను ప్రకటించాలన్నారు. ఐటి రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం లేదన్నారు. కాని ఐటి, ఇంజనీరింగ్ పరిశ్రమలు సంక్లిష్ట పరిస్ధితులను వ్యవస్ధాపరంగా ఎదుర్కొంటున్నాయన్నారు. పరిశ్రమల్లో పరిశోధనలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు.

చిత్రం..మోహన్ రెడ్డి