బిజినెస్

విశాఖ-చెన్నై కారిడార్‌పై కేంద్రంతో ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 19: విశాఖ నగరంలో ఈ నెల 27, 28 తేదీల్లో సిఐఐ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంయుక్తంగా జరిగే 23వ భాగస్వామ్య సదస్సులో 12 దేశాల వాణిజ్య మంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు పాల్లొంటున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్తికేయమిశ్రా వెల్లడించారు. విశాఖలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సదస్సులో ఆసియా దేశాల్లో వాణిజ్య అభివృద్ధిపై ఒక చర్చాగోష్ఠి జరుగుతుందని, ఇందులో 12 ఆసియా దేశాల వాణిజ్య మంత్రులు పాల్గొంటారన్నారు. శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉక్రెయిన్, జింబాబ్వే, కంబోడియా, బంగ్లాదేశ్, నేపాల్, చెకొస్లోవేకియా తదితర దేశాలతోపాటు మరికొన్ని ఆసియా దేశాల నుండి వాణిజ్య మంత్రులు హాజరవుతున్నట్టు ఇప్పటికే ఖరారు చేశారన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించి కీలకమైన భాగస్వామ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వంతో ఈ సదస్సులోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో సంతకాలు చేయనున్నట్టు పేర్కొన్నారు. దేశంలో పారిశ్రామిక కారిడార్‌ల ఏర్పాటుకు సంబందించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుందని, కేంద్రం దీని కోసం ఏర్పాటు చేసిన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రన్‌ట్‌తో ఒప్పందం కుదర్చుకోనున్నట్టు చెప్పారు. దేశంలో ఈ రకంగా ఒప్పందం కుదుర్చుకుంటున్న తొలి రాష్ట్ర ఏపియే అవుతుందన్నారు. నగరానికి వచ్చిన పరిశ్రమలశాఖ డైరెక్టర్ భాగస్వామ్య సదస్సు విశేషాలను గురువారం వివరించారు. ముఖ్యమంత్రిగా ఐదోసారి ఈభాగస్వామ్య సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్నారని, విశాఖలో వరసగా రెండోసారి నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సదస్సులో 50కిపైగా పరిశ్రమలు, వాణిజ్య ప్రతినిధులతో ఒన్ టు వన్ సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని, ఆరు దేశాల వాణిజ్య ప్రతినిధి బృందాలతో చర్చలు జరుపుతారని డైరెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. వివిధ రంగాల వారీగా రౌండ్‌టేబుల్ సమావేశాలు ఈ సదస్సు ప్రత్యేకంగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఏపిలో ప్రాధాన్యతారంగాలుగా గుర్తించిన ఏరోస్పేస్, డిఫెన్స్ ఉత్పత్తులు, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, బయోటెక్, ఫార్మా ఉత్పత్తులకు సంబందించిన పరిశ్రమలపై ఈ రౌండ్ సమావేశాలు జరుగుతాయని, ఈ సదస్సుల్లో ఆయా రంగాల్లోని అగ్రశ్రేణి సిఇఓలు పాల్గొంటారన్నారు. మన రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ రంగంపై పారిశ్రామికవేత్తలు ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారని, ఇప్పటికే ఫాక్స్‌కాన్ సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ ఫోన్ల తయారీ పెద్దఎత్తున జరుగుతోందన్నారు. ఆరు బ్రాండ్ల మొబైల్ పోన్లు ఉత్పత్తి జరుగుతున్నాయని, ఈ నేపధ్యంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల క్లస్టర్ల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
28న ఉదయం ఎలక్ట్రానిక్స్ తయారీపై రౌండ్ టేబుల్ సదస్సు జరుగుతుందన్నారు. దీంతోపాటు (లీవ్-లివరేజింగ్ ఫర్ ఎఫిషీయన్సీడాస్టబులిటీ, ప్రొడక్టివిటీ అనే అంశంపై ఇండియాను దృష్టిలోపెట్టుకుని ఒక సదస్సు జరుగుతుందన్నారు. ఇందులో కేంద్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి రమేష్ అభిషేక్, నీతి అయోగ్ సిఇఓ అమితాబ్కాంత్, కార్నెల్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ సంస్థ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారన్నారు. ఈ సదస్సులో భాగంగా అంతర్జాతీయంగా ప్రముఖ టైమ్ మ్యాగజైన్ సంస్థ ఇండియాలో తయారీ రంగంలో 2017 సంవత్సరపు అవార్డులను భాగస్వామ్య సదస్సులో అందజేస్తారన్నారు. మెకంజీ సంస్థతో కలిసి ఈ సంస్థ అవార్డులను అందజేస్తోందన్నారు. ఈ సదస్సులో కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, ఎం.వెంకయ్యనాయుడు, సురేష్‌ప్రభు, పీయాష్‌గోయెల్, ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీ, నిర్మలాసీతారామన్, పి.అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి హాజరుకానున్నట్టు తెలిపారు.

చిత్రం..వివరాలను వెల్లడిస్తున్న ఏపి పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్రా