బిజినెస్

మరో మూడు నెలలు జియో ఆఫర్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 20: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. మరో మూడు నెలలపాటు తమ ఆఫర్లను పొడిగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనవరి నుంచి మార్చి ఆఖరు వరకు ఆఫర్లను పొడిగించిన జియో.. జూన్ చివరిదాకా దీన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈసారి కొంత మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిరుడు సెప్టెంబర్ 4న ఉచిత కాల్స్, డేటా ఆఫర్‌తో దేశవ్యాప్తంగా 4జి టెలికామ్ సేవలను జియో ప్రారంభించినది తెలిసిందే. ఈ ఉచిత ఆఫర్ తొలుత డిసెంబర్ చివరి వరకే అని ప్రకటించిన జియో.. తర్వాత ఈ మార్చి 31దాకా వర్తిస్తుందని ప్రకటించింది. ఇప్పుడు మరో మూడు నెలలపాటు స్వల చార్జీలతో దీన్ని కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అనతి కాలంలోనే దేశీయ టెలికామ్ రంగంలో పెద్ద ఎత్తున కస్టమర్లను సంపాదించుకున్న జియో.. దిగ్గజ సంస్థలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కాగా, జియో ఉచిత ఆఫర్‌ను మార్చి 31దాకా పొడిగించడంపై ఇప్పటికే భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్ టిడిశాట్‌ను ఆశ్రయించినది తెలిసిందే. ఫిబ్రవరి 1న దీనిపై విచారణ జరగనుండగా, ఇంతలోనే మరో మూడు నెలల పొడిగింపునకు జియో ప్రయత్నిస్తుండటం.. ముకేశ్ దూకుడుకు అద్దం పడుతోంది. జియో ఉచిత ఆఫర్‌తో ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ సంస్థల ఆదాయం పెద్ద ఎత్తున పడిపోగా, కస్టమర్ల సంఖ్య కూడా తగ్గిపోతోంది. జియోకు ధీటుగా కాల్స్, డేటా చార్జీలను గణనీయంగా తగ్గిస్తున్నా ఫలితం ఉండటం లేదు.