బిజినెస్

రండి.. పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 20: తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వ్యాపార, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పాత పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించిన ఆమె దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడిపోయిందని, రాష్ట్ర పారిశ్రామిక రంగం కుదేలైందని అన్నారు. సాధారణ ప్రజానీకంతోపాటు వ్యాపారులు, రైతులు, అసంఘటిత రంగాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే వ్యాపార, పారిశ్రామిక రంగాలు తిరిగి పుంజుకోవాలని, అందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఇక్కడ మొదలైన రెండు రోజుల ‘బెంగాల్ గ్లోబల్ బిజినెస్ మీట్’లో మమతా మాట్లాడుతూ తమ రాష్ట్రంలో మిగు లు విద్యుత్, నైపుణ్య కలిగిన యువత, పుష్కలమైన శ్రామికశక్తి, భారీగా భూ వనరులున్నాయని అన్నారు. పరిశ్రమలకు కావాల్సినంతగా వౌలిక వసతులున్నాయని వివరించారు. ఈశాన్య, ఆగ్నేయాసియా దేశాలకు బెంగాల్ వ్యూహాత్మక ద్వారమని, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ దేశాలతోపాటు చైనాలోని కొన్ని ప్రాంతాలకూ బెంగాల్ దగ్గరని, వ్యాపార విస్తరణకు బెంగాల్ అనువైనదని చెప్పారు. ఇకపోతే రాబోయే కొనే్నళ్లలో బెంగాల్ ఎఫ్‌ఎమ్‌సిజి రంగంలో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనున్నట్లు ఆర్‌పి సంజీవ్ గోయెంకా గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయెంకా ఈ సందర్భంగా చెప్పారు. భారతీ ఎంటర్‌ప్రైజెస్ కూడా వచ్చే 2-3 ఏళ్లలో 3,000-4,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెడుతున్నట్లు ప్రకటించింది. బెంగాల్‌లో ఇప్పటిదాకా తమ గ్రూప్ దాదాపు 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టిందని సంస్థ వైస్ చైర్మన్ రాకేశ్ భారతీ మిట్టల్ చెప్పారు. ఫ్యూచర్ గ్రూప్ సిఇఒ కిశోర్ బియాని, హీరో గ్రూప్ సిఎండి పంకజ్ ముంజల్ సైతం బెంగాల్‌లో తమ భవిష్యత్ వ్యాపార కార్యకలాపాల గురించి వివరించారు. ఇక ఈ కార్యక్రమానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కూడా హాజరవగా, తక్కువ, ఆమోదయోగ్యమైన వడ్డీరేట్లుంటే పెట్టుబడులు పెరుగుతాయని అన్నా రు. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పుడు వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డ ఆయన ప్రస్తుతం భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని సానుకూలంగా ఉన్నాయన్నారు. కాగా, పలు రాజకీ య కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ దూరంగా ఉండగా, టీమిండి యా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతోపాటు బంగ్లాదేశ్ పారిశ్రామిక మంత్రి అమీర్ హుస్సేన్ అము, చైనా సిపిపిసి సి జైంగ్సూ ప్రావిన్షియల్ కమిటీ వైస్ చైర్మన్ ఫాన్ యాంగింగ్, కొరియాలో ని ఇంచెన్ నగర మేయర్ యూజియాంగ్ తదితరులు విచ్చేశారు.