బిజినెస్
7న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 21 January 2017
న్యూఢిల్లీ, జనవరి 20: బ్యాంక్ ఉద్యోగులు వచ్చే నెల ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఫిబ్రవరి 7న ఈ ఆందోళన చేపట్టనున్నారు. బ్యాంకింగ్ సిబ్బంది డిమాండ్లలో పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విధించిన ఆంక్షల ఎత్తివేత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) స్వయంప్రతిపత్తికి భంగం కలిగించరాదనే డిమాండ్లు కూడా ఉన్నాయి. కాగా, తమ సమస్యల పరిష్కారార్థం కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ తగ్గు చర్యలు చేపడతాయన్న ఆశాభావాన్ని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ) ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం వ్యక్తం చేశారు.