బిజినెస్

ఆర్థిక ఫలితాలపై బెంగతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 20: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ ప్రపంచంలోని కీలక మార్కెట్లు నష్టాలకు లోనవడం కూడా దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ఆయా కార్పొరేట్ సంస్థలు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి. దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో మూడో అతిపెద్ద బ్యాంకైన యాక్సిస్ బ్యాంక్ లాభం భారీగా తగ్గిపోవడమే ఇందుకు కారణం. గతంతో పోల్చితే అక్టోబర్-డిసెంబర్‌లో యాక్సిస్ బ్యాంక్ లాభం ఏకంగా 73 శాతం క్షీణించి 580 కోట్ల రూపాయలకే పరిమితమైంది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 274.10 పాయింట్లు పతనమై 27,034.50 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 85.75 పాయింట్లు కోల్పోయి 8,349.35 వద్ద నిలిచింది. మెటల్, ఇన్‌ఫ్రా, పిఎస్‌యు, బ్యాంకింగ్ షేర్లు 2.37 శాతం నుంచి 1.77 శాతం వరకు నష్టపోయాయి. కాగా, ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 203.56 పాయింట్లు క్షీణిస్తే, నిఫ్టీ 51 పాయింట్లు పడిపోయింది. ఇక ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ సూచీ 0.71 శాతం నష్టపోగా, చైనా, జపాన్ సూచీలు వరుసగా 0.70 శాతం, 0.34 శాతం మేర లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలో బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు నష్టపోయాయి. మరోవైపు సిపిఎస్‌ఇ ఇటిఎఫ్‌కు అధికంగా రూ. 12 వేల కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయ.