బిజినెస్

నేడు మార్కెట్లోకి బిఎస్‌ఇ పబ్లిక్ ఇష్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి (బిఎస్‌ఇ) పబ్లిక్ ఇష్యూ (ఐపిఓ) సోమవారం మార్కెట్లోకి రానుంది. ఒక దేశీయ స్టాక్ మార్కెట్ పబ్లిక్ ఇష్యూకు రావడం ఇదే మొదటిసారి కాగా, ఈ ఏడాది వస్తున్న తొలి ఐపిఓ కూడా ఇదే కావడం గమనార్హం. ఈ నెల 23న ప్రారంభమయ్యే ఈ ఇష్యూ 25తో ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా బిఎస్‌ఇ రూ. 1234 కోట్లు సమీకరించాలని అనుకొంటోంది. ప్రతి షేరు ధర 805-806 రూపాయల మధ్య ఉంటుంది. గరిష్ఠంగా వాటాదారులు రూ. 1243.44 కోట్ల విలువైన 2రూపాయల ముఖ విలువ కలిగిన 15.43 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. ఇది మొత్తం బిఎస్‌ఇ వాటా ధనంలో 28.26 శాతంగా ఉంటుంది. ఈ ఇష్యూ కోసం కనిష్టంగా 18 షేర్లు, ఆపై దాని గుణిజాల మేరకు బిడ్స్‌ను దాఖలు చేసుకోవచ్చు. ఒక ఎక్స్‌చేంజి తన షేర్లను తానే లిస్టింగ్ చేయడానికి వీలు లేనందున బిఎస్‌ఇ షేర్లు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజిలో లిస్టింగ్ కానున్నాయి. ఐపిఓకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలకు మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబి గత డిసెంబర్ 30న తుది అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి(ఎన్‌ఎస్‌ఇ) కూడా సుమారు 10 వేల కోట్ల రూపాయల ఐపిఓ కోసం గత నెల సెబికి ముసాయిదా పత్రాలను సమర్పించింది. ప్రస్తుతం బిఎస్‌ఇలో దాదాపు 9 వేల మంది వాటాదారులున్నారు. బిఎస్‌ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 1,10,23,189 కోట్లుగా ఉంది.
మరో 3కంపెనీలపై ఎన్‌ఎస్‌ఇ వేటు
ఇదిలా ఉండగా దీర్ఘకాలంగా లావాదేవీలు లేని లిస్టెడ్ కంపెనీలపై చర్యల్లో నాగంగా నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి(ఎన్‌ఎస్‌ఇ) వచ్చే నెలనుంచి మరో 3 కంపెనీలను తన ప్లాట్‌ఫామ్‌నుంచి తొలగించనుంది. ఇలా డీలిస్ట్ అయ్యే కంపెనీల్లోఅరిహంత్ త్రెడ్స్, కాంపర్ కాన్‌కాస్ట్, కృష్ణా ఇంజనీరింగ్ వర్క్స్ ఉన్నాయి. గత ఆగస్టు-నవంబర్ మధ్య కాలంలో ఎన్‌ఎస్‌ఇ 28 కంపెనీలను తన ప్లాట్‌ఫామ్‌నుంచి తొలగించింది. ఇప్పుడు అదనంగా మరో 3 కంపెనీలపై అదే రకమైన చర్య తీసుకోబోతోంది. 2009 సెబి నిబంధనల 5వ చాప్టర్ ప్రకారం ఫిబ్రవరి 7నుంచి ఈ మూడు కంపెనీల షేర్లను డీలిస్ట్ చేయాలని ఎన్‌ఎస్‌ఇ నిర్ణయించినట్లు ఎన్‌ఎస్‌ఇ ఒక ప్రకటనలో తెలిపింది.