బిజినెస్

ట్రంప్ పాలసీ.. బడ్జెట్ భయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో పాటుగా కార్పొరేట్ ఫలితాలు, రాబోయే కేంద్ర బడ్జెట్‌పై అంచనాలు ఈ వారం మార్కెట్ తీరుతెన్నులను నిర్ణయించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత శుక్రవారం అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ అమెరికన్ల ఉద్యోగాలు వారికే దక్కేలా చేస్తానని, అక్రమ వలసలను అరికట్టి సరిహద్దులను కాపాడుతానన్న తన హామీని పునరుద్ఘాటించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆయన విధానాలు ఏ విధంగా ఉంటాయో మదుపరులు జాగ్రత్తగా గమనించే అవకాశం ఉందని వారంటున్నారు. గణతంత్ర దినోత్స సందర్భంగా గురువారం మార్కెట్లకు సెలవు. ఈ వారం ట్రంప్ విధానాలు, కార్పొరేట్ ఫలితాలు, రాబోయే కేంద్ర బడ్జెట్‌పైనే మార్కెట్ దృష్టి ప్రధానంగా ఉంటుందని కోటక్ సెక్యూరిటీస్ పిసిజి రిసెర్చ్ విభాగం వైస్‌ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే అభిప్రాయ పడ్డారు. అమెరికా కొత్త అధ్యక్షుడు తీసుకోబోయే నిర్ణయాలను జాగ్రత్తగా గమనించిన తర్వాతే మదుపరులు దేశీయ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావచ్చని అంటున్నారు. ‘ప్రమాణ స్వీకారం సమయంలో ట్రంప్ చేసిన ప్రకటనల ప్రభావం ఎలా ఉంటుందో గమనించడం ఈ వారంలో తప్పదు. అలాగే హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సి, భారతీ ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్‌లాంటి కార్పొరేట్ దిగ్గజాల ఫలితాలు సైతం కేంద్ర బడ్జెట్‌కు మార్కెట్ గతిని నిర్ణయించే అవకాశముంది’ అని ఎపిక్ రిసెర్చ్ సిఈఓ ముస్త్ఫా నదీమ్ అభిప్రాయ పడ్డారు. ఈ వారం ఫార్వర్డ్స్, ఆప్షన్ల గడువు ముగుస్తుండడంతో సహజంగానే మార్కెట్లో ఆటుపోట్లు ఉంటాయని, అంతేకాదు ఇప్పటికే ఎంతో చర్చ జరిగిన కేంద్ర బడ్జెట్ కూడా దగ్గర పడుతుండడంతో అది కూడా మార్కెట్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆమ్రపాలి ఆద్య ట్రేడింగ్, ఇనె్వస్ట్‌మెంట్స్ డైరెక్టర్, రిసెర్చ్ విభాగం అధిపతి అబ్నిష్ కుమార్ సుధాంశు అన్నారు. ఇదిలా ఉండగా అక్రమ నిధుల ప్రవాహానికి పినోట్లను మార్గంగా ఉపయోగించుకుకుంటున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటికి సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబి యోచిస్తోందన్న వార్తలపైన కూడా స్టాక్ మార్కెట్లు స్పందించే అవకాశం ఉంది. వీటన్నిటి కారణంగా బడ్జెట్ కోసం వేచి చూడడం ద్వారా మార్కెట్లో ర్యాలీకి కొంత విరామం ఏర్పడవచ్చని శామ్‌కో సెక్యూరిటీస్ సిఈఓ జిమీత్ మోదీ అభిప్రాయ పడ్డారు. గత వారం బిఎస్‌ఇ సెనె్సక్స్ 203.56 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. డెరివేటివ్‌ల గడువు ముగింపు, అంతర్జాతీయ పరిణామాలు, మూడో త్రైమాసిక ఫలితాలు, బడ్జెట్ అంచనాలు ఇవన్నీ కూడా ఈ వారం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపించనున్నాయని ట్రేడ్‌స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అభిప్రాయ పడ్డారు.