బిజినెస్

భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌కు గూగుల్ ఉచిత వైఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: రైలు ప్రయాణీకులకు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని విస్తరిస్తూ.. గూగుల్ ఆదివారం భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై సేవలను ప్రారంభిస్తోంది. ఉచిత వైఫై ప్రాజెక్టులో భాగంగా దేశంలో గూగుల్ ప్రస్తుతం ముంబయి సెంట్రల్‌లో మాత్రమే ఈ సేవలను అందిస్తోంది. ఈ క్రమంలో గూగుల్ ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉన్న రెండో రైల్వే స్టేషన్‌గా భువనేశ్వర్ అవతరించనుంది. స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి మొబైల్ వినియోగదారుడు ఈ వైఫైని ఉచితంగా పొందవచ్చు. రైళ్ల కోసం స్టేషన్‌లో గంటల తరబడి వేచియుండే ప్రయాణికులకు ఈ వైఫై సేవలు ఎంతో కాలక్షేపంగా, ఉపయుక్తంగా ఉంటున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఆఖరుకల్లా దేశవ్యాప్తంగా రద్దీగల 100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను రైల్వే శాఖ తీసుకురానుంది. కాగా, త్వరలో దేశవ్యాప్తంగా మరో 10కిపైగా రైల్వే స్టేషన్లలో గూగుల్ ఉచిత వైఫై సేవలను ప్రారంభించనుంది. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కాచిగూడ, విజయవాడ, విశాఖపట్ట ణంతోపాటు జైపూర్, పాట్నా, రాంచీ, ఎర్నాకులం, అలహాబాద్, లక్నో, గువాహటి, పుణె, రాయ్‌పూర్, భోపా ల్ రైల్వే స్టేషన్లున్నాయ.