బిజినెస్

కళ్లు కప్పలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: అక్రమంగా ఆస్తులను కూడబెట్టిన నల్లకుబేరులను కేంద్ర ప్రభుత్వం మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరించింది. తమ కళ్లు గప్పి అక్రమ ఆస్తులను దాచిపెట్టలేరని, కనుక ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పిఎంజికెవై) పథకం కింద ఒకేసారి అన్ని అప్రకటిత ఆస్తులను వెల్లడించి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదాయ పన్ను విభాగం వారికి స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ప్రముఖ జాతీయ దినపత్రికల్లో అడ్వర్టైజ్‌మెంట్లు విడుదల చేసింది. గత ఏడాది నవంబర్ 8వ తేదీన పాత 500, 1000 రూపాయల నోట్ల చలామణిని రద్దు చేసిన అనంతరం ప్రభుత్వం ప్రకటించిన పిఎంజికెవై పథకంలోని ముఖ్యాంశాలను ఈ అడ్వర్టైజ్‌మెంట్లలో వివరించింది. ‘మాకు తెలియకుండా మీరు అప్రకటిత ఖాతాలను, నగదు డిపాజిట్లను దాచిపెట్టలేరు. కనుక మున్ముందు మీరు ఇబ్బందుల్లో పడకుండా చూసుకోవాలంటే మీ వద్ద ఉన్న అప్రకటిత సొమ్మునంతా పిఎంజికెవైలో పెట్టుబడులుగా పెట్టి దేశంలోని పేద ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధికి చేయూతనివ్వండి’ అని ఆదాయ పన్ను విభాగం ఆ అడ్వర్టైజ్‌మెంట్‌లో పేర్కొంది. అప్రకటిత ఆస్తులను వెల్లడించాలన్న తమ సూచనను పాటించని వారికి తీవ్రమైన ఇబ్బందులు తప్పవని, ఆ సొమ్ముపై పెనాల్టీతో పాటు భారీగా 77.25 శాతం మొత్తాన్ని సుంకాలు, సర్‌చార్జీలు, పెనాల్టీల రూపంలో చెల్లించుకోవడంతో పాటు నిందితులు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. పిఎంజికెవై పథకం మార్చి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని, ఈ పథకం ద్వారా అప్రకటిత ఆస్తులను వెల్లడించిన వారి పేర్లు, ఇతర వివరాలను పూర్తి గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆదాయ పన్ను శాఖ తెలిపింది.
అనుమానాస్పద లావాదేవీలపై దృష్టి
ఇదిలావుంటే, పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలోని వివిధ బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో జరిగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. రద్దయిన పాత 500, 1000 రూపాయల నోట్ల మార్పిడి గడువు ముగియడానికి పది రోజుల ముందు కొత్త ఖాతాల్లోకి వచ్చిపడిన నగదు డిపాజిట్లు, రుణాల చెల్లింపులు, ఇ-వ్యాలెట్లలోకి జరిగిన నగదు బదిలీలతో పాటు దిగుమతుల కోసం ముందస్తుగా జరిపిన చెల్లింపుల వివరాలను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. పాత నోట్ల మార్పిడికి గడువుగా నిర్దేశించిన 50 రోజుల సమయంలో బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో జరిగిన నగదు డిపాజిట్లపై విశే్లషణ జరిపిన అధికారులు ఇప్పుడు నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ప్రారంభమైన కొత్త ఖాతాలు, టర్మ్ డిపాజిట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం పాన్‌ను సమర్పించకుండా రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తాల్లో నగదు డిపాజిట్లు చేసిన వారి విషయంలో ఆదాయ పన్ను విభాగం ఇప్పటికే చర్యలు చేపడుతోందని, ఇటువంటి డిపాజిట్లు చేసిన వారిని గుర్తించేందుకు అందుబాటులో ఉన్న సాధనాలు, వనరులను ఉపయోగించుకుంటున్న ఆదాయ పన్ను విభాగం మున్ముందు దేశంలో పన్నుల వ్యవస్థ పరిమాణంతో పాటు ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పెరగడం ఖాయమని గట్టిగా విశ్వసిస్తోందని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.