బిజినెస్

నంద్యాలలో మెగాసీడ్ పార్కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జనవరి 23: కర్నూలు జిల్లాలోని నంద్యాల ప్రాంతంలో మెగా సీడ్‌పార్కు ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. అమెరికాలోని అయోవా స్టేట్ యూనివర్శిటీ విత్తన విభాగం ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో తొలి దశ చర్చలు సానుకూల వాతావరణంలో జరిగినట్లు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డా. ఎంవి నాయుడు తెలిపారు. ఈనెల 27వ తేదీ నుంచి విశాఖపట్నంలో జరుగనున్న భాగస్వామ్య సదస్సులో మెగా సీడ్‌పార్కు విషయంపై స్పష్టత వస్తుందని సోమవారం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయోవా యూనివర్శిటీ మధ్య భాగస్వామ్య సదస్సులో ఎంఓయు జరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. అమెరికా యూనివర్శిటీ బిగ్‌డేటా వినియోగంతో నంద్యాల ప్రాంతంలో మెగా విత్తన పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే ప్రపంచ బ్యాంకు లేదా నాబార్డు నుంచి 40 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందే అవకాశాలు ఉన్నాయన్నారు. మెగా సీడ్‌పార్కు ఏర్పాటుకు ఎంఓయు కుదిరితే ఆసియాలోనే అత్యుత్తతమమైన విత్తన భాండాగారంగా నంద్యాల ప్రాంతం అభివృద్ధి సాధిస్తుంది. గతంలోనే నంద్యాల సీడ్‌హబ్‌గా మంచి పేరు ప్రతిష్టలు సాధించింది. అయితే ప్రైవేటు విత్తన కంపెనీల వారికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వకపోవడం, ప్రోత్సాహకాలు కల్పించకపోవడంతో సీడ్ కంపెనీలు ఒక్కొక్కటిగా నంద్యాల ప్రాంతాన్ని వదిలి తెలంగాణ రాష్ట్రానికి చేరాయి. మెగా సీడ్‌పార్కు ఏర్పాటు అయితే దేశంలో ప్రఖ్యాతిగాంచిన సీడ్ కంపెనీలు మళ్లీ నంద్యాల బాట పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నంద్యాల సీడ్‌హబ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తంగెడంచలో 500 ఎకరాలు కేటాయించడం, వౌలిక సదుపాయాలు, పరిశోధనా కేంద్రం ఏర్పాటు, గోదాముల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడంతోపాటు పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది దాదాపు 500 ఎకరాల్లో పలు విత్తన పంటలను సాగుచేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే కార్యక్రమం ముమ్మరంగా సాగనుంది.