బిజినెస్

సహకార బ్యాంకులపై నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 23: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సహకార బ్యాంకులపై కేంద్రం పెట్టిన నిఘాతో అన్నదాతపై ఆంక్షలు వచ్చిపడ్డాయ. పాత బకాయిలు తక్షణమే చెల్లించాలంటూ హుకుం జారీ చేస్తుండగా, చెల్లించిన బకాయిల సొమ్ము ఏ విధంగా వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఈ వింత ధోరణితో సహకార బ్యాంకులు అయోమయంలో పడుతుండగా, రైతులకు దిక్కుతోచడం లేదు. ఫలితంగా దేశంలోని జిల్లా కేంద్ర సహకార (డిసిసి) బ్యాంకులు ఆర్థికంగా తీవ్ర నష్టాలకు చేరుకుంటున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న డిసిసి బ్యాంకుల పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. పాత పెద్ద నోట్ల రద్దు తరువాత రైతుల నుంచి బకాయిల సొమ్ము ఎంత వచ్చింది? అనుకున్నట్టుగా బకాయిలు చెల్లిస్తే ఆ సొమ్ము ఎక్కడ నుంచి వచ్చింది? పెద్ద నోట్ల రద్దుకు ముందు ఎందుకు చెల్లించలేకపోయారు? అసలు ఈ 75 రోజుల్లో ఎంతమంది రైతులు చెల్లించగలిగారు? ఎంతెంత వారివారి ఖాతాల్లో జమ అయింది? అనే సవాలక్ష ప్రశ్నలతో కేంద్రం.. సహకార బ్యాంకుల యాజమాన్యాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెల్లారితే చాలు దీనిపై కసరత్తుతోనే సరిపోతుందంటూ బ్యాంకు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయ. పెద్ద నోట్ల రద్దుతో ఏలాగూ కోట్లాది రూపాయల వ్యాపారాన్ని తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. దీనికి ఇపుడు విధిస్తున్న నిబంధనలు, రుణాల మంజూరులో అమలు చేస్తున్న షరతులు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. రుణం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారంపై రుణాలు, సేవింగ్ ఖాతాలు ఈ విధంగా ప్రతిఒక్క దానిపైన కేంద్రం ఆంక్షలు విధించింది. పొరపాటున రైతు సభ్యులు సహకార బ్యాంకు నుంచి రుణం కోరితే అది రెండున్నర లక్షలు ఉంటే దీనికి అనేకం చూపాల్సిందే. ఇదే మొత్తం దాటితే ఇంకొన్ని నిబంధనలు వర్తిస్తాయి. రెండున్నర లక్షలు రుణం పొందే రైతుల సేవింగ్ ఖాతాలో ఈ మొత్తం జమ అవుతుంది. ఆ తరువాత ఈ రుణ మొత్తాన్ని ఒకేసారి తీసుకునేందుకు వీల్లేదు. వారంలో 24 వేల వంతున తీసుకోవాల్సిందే. అలా కాకుండా సేవింగ్ ఖాతాలోనే ఉంచుకుంటే తీసుకున్న రుణం మొత్తానికి వడ్డీని చెల్లించాల్సిందే. ఇటువంటి ఇబ్బందులతో ఇపుడు రైతాంగం దిక్కుతోచని పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2.5 లక్షల రూపాయలు దాటిన రుణాలకు సంబంధిత రైతు సభ్యుల నుంచి పాన్ కార్డును తీసుకోవాలంటూ కేంద్రం కొత్త నిబంధన పెట్టింది. మొత్తానికి పంట రుణాలు, ఇంటి రుణాలు, క్రెడిట్, గోల్డ్‌లోన్లు, సేవింగ్ ఖాతాలో డిపాజిట్లు తదితర వాటికి పెట్టిన ఆంక్షలు ఖాతాదారులకు, రైతులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.
వెంటాతున్న ఆదాయ పన్ను శాఖ
అసలే కేంద్రం నిబంధనలతో రాష్ట్రంలో రైతాంగం, బ్యాంకు యాజమాన్యాలు సతమతమవుతుంటే మరోపక్క ఆదాయ పన్ను శాఖ సహకార బ్యాంకులు, వీటి శాఖలపై పడుతున్నాయి. బ్యాంకు ఖాతాల్లో 2.5 లక్షల రూపాయలున్నా.. ఇది దాటినా దానికీ నోటీసులు జారీ చేస్తోంది. దీనికి తక్షణమే సమాధానాలివ్వాల్సిందిగా బ్యాంకు యాజమాన్యాలను కోరుతోంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాలోను జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి) ఉంది. ఒక్కో డిసిసి బ్యాంకు పరిధిలో కనీసం 90 నుంచి 100 వరకు ప్రాథమిక సహకార పరపతి సంఘాలున్నాయి. వీటి ద్వారా దాదాపు లక్ష మంది రైతు సభ్యులు ఖరీఫీ, రబీ సీజన్లలో దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలను పొందుతుంటారు. ఈ విధంగా ప్రతి జిల్లాలోను కనీసం 200 కోట్ల రూపాయల మేర రుణాల మంజూరు జరుగుతుంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఈ విధంగా మంజూరైన రుణాలు 600 కోట్ల రూపాయలకు పైబడి ఉంటుంది. ఆప్కాబ్ పర్యవేక్షణలో నడుస్తున్న డిసిసి బ్యాంకులకు నాబార్డు ఆర్థికంగా ఆదుకుంటూ ఉంటుంది. ఈ విధమైన రుణాల మంజూరుతోపాటు బ్యాంకు శాఖల ద్వారా బంగారంపైన రుణాలు, ఖాతాదారుల పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలోనే బ్యాంకులు వ్యాపారం చేస్తుంటాయి. ఇన్ని విధాలుగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న డిసిసి బ్యాంకులకు నవంబర్ 8 రాత్రి కేంద్రం అమల్లోకి తెచ్చిన పాత (రూ. 1,000, 500) పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పిడుగుపాటులా మారింది. డిపాజిట్లపరంగాను, రుణాల మంజూరు రూపంలోను నగదు లావాదేవీల అవకాశం లేకుండా పోయింది. ఈ విధంగా ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 300 కోట్ల రూపాయల కుపైగా బ్యాంకు నష్టపోవాల్సి వచ్చింది. తీరా ఇపుడు ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో ఖాతాల లెక్కలు మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతోంది. అయతే పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆదాయ పన్ను శాఖ గుర్తించడమే తాజా విపత్కర పరిస్థితులకు కారణంగా తెలుస్తోంది.