బిజినెస్

పాలీహౌజ్‌లకు ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: తెలంగాణ రాష్ట్రంలో తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే విధానాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అందుకే ‘పాలీహౌజ్’లను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. నెదర్లాండ్స్ నుండి వ్యవసాయం, ఉద్యాన రంగాలకు సంబంధించి వచ్చిన అధికారిక బృందంతో ఆయన తన ఛాంబర్‌లో సోమవారం చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణలో వ్యవసాయ, ఉద్యాన, ఫ్లోరీకల్చర్ రంగాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఎక్కువగా వర్షాధారంపైనే సేద్యం జరుగుతోందని, భూగర్భ జలాలపై ఆధారపడి పంటలు పండిస్తున్నామని తెలిపారు. సాగునీటిని అందించేందుకు భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టామన్నారు. ఒకవైపు నీటిపారుదల ప్రాజెక్టులను పెద్దఎత్తున చేపడుతూనే, మరోవైపు వర్షపునీటిని సంరక్షించుకునేందుకు చిన్నతరహా నీటిపారుదలను ప్రోత్సహిస్తున్నామన్నారు. వర్షపునీటిని సంరక్షించుకుంటూ, భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. దీనివల్ల వర్షాభావ ప్రాంతాలుగా పేరువచ్చిన కొన్ని జిల్లాల్లో కూడా సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. రైతులపై ఆర్థిక భారం తగ్గించేందుకు పాలీహౌజ్‌ల నిర్మాణం, నిర్వహణ కోసం పెద్దమొత్తంలో సబ్సిడీ ఇస్తున్నామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను, అగ్రిప్రాసెసింగ్ యూనిట్స్‌తో అనుసంధానం చేయడం వల్ల రైతులకు మంచి ధరలు లభిస్తాయన్నారు. ఇప్పటివరకు వెయ్యి ఎకరాల్లో పాలీహౌజ్‌లు ఏర్పాటయ్యాయని తెలిపారు. ఈ విషయంలో నెదర్లాండ్స్ సహకారం తీసుకుంటామని మంత్రి వివరించారు.
కాగా, నెదర్లాండ్స్‌లో పాలిహౌజ్‌ల ద్వారా వ్యవసాయం పెద్ద ఎత్తున చేపట్టామని నెదర్లాండ్స్ ప్రతినిధి బృందం ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులు, ఆహారోత్పత్తులు, మాంసం, పాడి రంగాల్లో అత్యధిక ఉత్పత్తి జరుగుతోందని, పూల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నెదర్లాండ్స్ సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం-నెదర్లాండ్స్‌లోని ‘వాగెనింగన్’ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పరిశోధనారంగంలో సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ పరిశోధనలు రైతులకు ఉపయోగపడేవిధంగా ఉండాలని నిర్ణయించారు.