బిజినెస్

ఆకట్టుకున్న మెటల్ షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 23: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 82.84 పాయింట్లు పెరిగి 27,117.34 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 42.15 పాయింట్లు అందుకుని 8,391.50 వద్ద నిలిచింది. ఫిబ్రవరి 1న వచ్చే కేంద్ర బడ్జెట్‌పై మదుపరులలో నెలకొన్న ఆశలు మార్కెట్ లాభాలకు కారణమైయ్యాయని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశే్లషిస్తున్నారు. మెటల్, పిఎస్‌యు, చమురు, గ్యాస్, ఐటి రంగాల షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, సింగపూర్ సూచీలు లాభపడితే, జపాన్ సూచీ నష్టపోయింది.