బిజినెస్

రూ. 17,500 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 23: దేశ వ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారికి వౌలిక వసతులు కల్పించేందుకు రానున్న ఐదేళ్ళలో 17,500 కోట్ల రూపాయలు వ్యయం చేయడానికి ఎయిర్‌పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా నిర్ణయించిందని కేంద్ర విమానాయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు చెప్పారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సోమవారం పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రయాణికుల వౌలిక వసతులపై సమావేశంలో కీలకంగా చర్చించామన్నారు. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని నిర్ణయించామన్నారు. విమానయాన శాఖలో అనుకూల, ప్రతికూల అంశాలపై కూడా చర్చించామన్నారు. ప్రపంచంలో విమానయానరంగంలో భారత్ ఎంతో ముందంజలో ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 22 శాతం అభివృద్ధి ఉందని, అందులో ఏపిని ప్రత్యేకంగా తీసుకుంటే ఒక్క విజయవాడలోనే 71 శాతం అభివృద్ధి ఉందన్నారు. తిరుపతిలో ఏడు విమానాలు ప్రతి రోజు వచ్చిపోతున్నాయని, అయతే గత రెండు సంవత్సరాల క్రితం ఈ పరిస్థితి లేదని చెప్పారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని శంషాబాద్ విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా ఒకవైపు పనులు చేపడుతూనే మరోవైపు ట్రాఫిక్‌ను పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 2015-16 సంవత్సరంలో రాష్ట్రంలో విమాన ప్రయాణం 59 శాతం ఉందని, ఈ ఏడాది ఒక్క తిరుపతి విమానాశ్రయంలోనే 49 శాతం జరిగిందన్నారు. రాజమండ్రి 39, విశాఖ 62 శాతం చొప్పున ప్రయాణాలు సాగాయన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 60 శాతం అభివృద్ధి సాధ్యమైందని మంత్రి తెలిపారు. రానున్న కాలంలో రాష్ట్రంలోను దేశంలోను ఎయిర్ ట్రాఫిక్ మరింతగా పెరుగుతుందన్నారు. ఏపిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 12 సంస్థలు నిర్మాణ పనులను వేగవంతంగా చేస్తున్నాయన్నారు. ఇప్పటివరకు ఏపికి 2.25 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికైనాసరే పౌర విమానాయానానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కాగా, విజయవాడలో 800 ఎకరాల్లో విమానయాన విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులను పెంచనున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. దేశంలో వాల్యూయేటెడ్ టాక్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఒక్క శాతమే అన్నారు. ప్రత్యేక హోదా విషయమై విలేఖరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధాన మిస్తూ హోదా కంటే అధిక ప్రయోజనాలే రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అబూతకల్పనలను సృష్టించి ప్రజలను తప్పుదారి పట్టించడం వల్ల పెద్దగా ఒరిగేదేమి ఉండదన్నారు. మన రాష్ట్రం బాగుపడాలన్నదే మనందరి సంకల్పమన్నారు.
కాగా, పార్లమెంటరీ కమిటీ సమీక్షా సమావేశంలో ఎంపిలు రాయపాటి సాంబశివరావు, ప్రపుల్లా పటేల్, రాజేంద్రన్, జిత్తేంద్ర చౌదరి, చంద్రకాంత్ పటేల్, కేంద్ర విమానయాన శాఖ సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్ చోబే, అధికారులు అనిల్ శ్రీవత్సవ, అంకూర్ కార్గ్, వి అప్పారావు, ఎస్ శ్రీనివాసరావు, తిరుపతి ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ హెచ్ పుల్లా తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ తిరుమలలో నో ఫ్లై జోన్ ఏర్పాటు చేయడం అంత సులభం కాదని అయితే భక్తుల మనోభావాలను దెబ్బతినకుండా, శ్రీవారి ఆలయంపై విమానాలు వెళ్ళకుండా సంబంధిత అధికారులతో చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు.