బిజినెస్

తెలంగాణవ్యాప్తంగా సామ్‌సంగ్ సర్వీస్ వ్యాన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: తెలంగాణలో సామ్‌సంగ్ ఇండియా.. సర్వీస్ వ్యాన్లను ప్రారంభించింది. తమ కస్టమర్లకు ఇంటివద్దే ప్రపంచ శ్రేణి సేవలను అందించేలా సామ్‌సంగ్ ఇండియా ఈ నిర్ణయానికొచ్చింది. ఇందులో భాగంగానే 19 సర్వీస్ వ్యాన్లను అందుబాటులోకి తెచ్చింది. తొలి దశలో వీటిని మంగళవారం హైదరాబాద్ నగరానికి పరిచయం చేసింది. డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమక్షంలో సంస్థ కస్టమర్ సాటిస్‌ఫాక్షన్ విభాగం ఉపాధ్యక్షుడు అనురాగ్ ప్రశార్ చేతులమీదుగా ఈ వ్యాన్ల సేవలు మొదలయ్యాయి. ఈ మేరకు ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది. సామ్‌సంగ్ ఉత్పత్తులకు సంబంధించి వినియోగదారులు చేసే ఫిర్యాదులపై తక్షణ పరిష్కారాన్ని ఈ వ్యాన్లలోని నిపుణులు అందిస్తారని చెప్పింది.