బిజినెస్

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు పాత పెద్ద నోట్ల రద్దు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తృతీయ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 15 శాతం పెరిగి 3,865.3 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 3,356.84 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, త్రైమాసిక ఫలితాల్లో ఇంత తక్కువ స్థాయిలో వృద్ధి నమోదు కావడం ఇదే. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంక్ వ్యాపార లావాదేవీలు పడిపోవడమే కారణం. ఆదా యం ఈసారి 20,748.27 కోట్ల రూపాయలుగా, పోయినసారి 18,283.31 కోట్ల రూపాయలుగా ఉందని మంగళవారం బ్యాంక్ తెలియజేసింది.