బిజినెస్

హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లాభం రూ. 2,070 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: దేశీయ నాలుగో అతిపెద్ద ఐటిరంగ సంస్థ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 7.8 శాతం పెరిగి 2,070 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 1,920 కోట్ల రూపాయలుగా ఉంది. ఏకీకృత ఆదాయం కూడా ఈసారి 14.2 శాతం ఎగిసి 11,814 కోట్ల రూపాయలకు చేరింది. నిరుడు 10,341 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు సంస్థ మంగళవారం తెలిపింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సంస్థ ఆదాయం వృద్ధిరేటు 12-14 శాతంగా ఉండొచ్చని హెచ్‌సిఎల్ అంచనా వేసింది. మరోవైపు అమెరికాలో విదేశీ ఉద్యోగులకు కావాల్సిన హెచ్1-బి, ఎల్1 వీసాలపై ఆ దేశ నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరి నేపథ్యంలో స్థానికంగానే ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు హెచ్‌సిఎల్ ప్రకటించింది. వీసా ఇబ్బందులు లేకుండా అమెరికా ప్రాజెక్టులకు అక్కడివారి చేతనే పనిచేయించుకుంటామని చెప్పింది. దీంతో ఇక భారత్ నుంచి హెచ్‌సిఎల్ తరఫున అమెరికాకు వెళ్లే ఉద్యోగులు తగ్గనున్నారు.