బిజినెస్

జియో ధాటికి ఎయిర్‌టెల్ లాభం ఆవిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో 54 శాతానికిపైగా క్షీణించి 503.7 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 1,108.1 కోట్ల రూపాయలుగా ఉంది. ఏకీకృత ఆదాయం ఈసారి 23,363.9 కోట్ల రూపాయలుగా, నిరుడు 24,103.4 కోట్ల రూపాయలుగా ఉందని మంగళవారం ఓ ప్రకటనలో సంస్థ భారత్, దక్షిణాసియా విభాగం ఎండి, సిఇఒ గోపాల్ విట్టల్ తెలిపారు. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన 4జి టెలికామ్ సంస్థ జియో ఇన్ఫోకామ్ దెబ్బకు ఎయిర్‌టెల్ వ్యాపారం పడిపోవడమే లాభాల్లో క్షీణతకు ప్రధాన కారణం. దేశవ్యాప్తంగా 4జి సేవలను నిరుడు సెప్టెంబర్ నుంచి జియో ఉచితంగా అందిస్తున్నది తెలిసిందే.