బిజినెస్

బిఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్రీ-పెయిడ్ ఆఫర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. మూడు సరికొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్లను పరిచయం చేసింది. టెలికామ్ రంగంలో ప్రైవేట్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడంలో భాగంగా ఈ నూతన స్కీమ్‌లకు బిఎస్‌ఎన్‌ఎల్ శ్రీకారం చుట్టగా, 26 రూపాయల టారీఫ్ వోచర్‌పై 26 గంటలపాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత లోకల్, ఎస్‌టిడి వాయిస్ కాల్స్‌ను ఇస్తోంది. మిగతా రెండు ఆఫర్లైన ‘కోంబో 2601’, ‘కోంబో 6801’ వినియోగదారులకు రిచార్జ్ మొత్తానికి 1.5 రెట్లు, రెట్టింపు స్థాయిలో టాక్‌టైమ్‌ను అందిస్తాయి. 26 రూపాయల ఆఫర్ ఈ నెల 25 నుంచి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ సిఎండి అనుపమ్ శ్రీవాత్సవ మంగళవారం ఇక్కడ తెలిపారు. మిగతా రెండు ఆఫర్లు మార్చి 31వరకు లభిస్తాయన్నారు.