బిజినెస్

ద్రవ్యోల్బణం 5% మించదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్‌బిఐ తన లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకోగలదని, ఎందుకంటే 2017 తొలి అర్ధ్భాగంలో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (సిపిఐ) 5 శాతంకన్నా తక్కువలోనే ఉండే అవకాశముందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం హెచ్‌ఎస్‌బిసి ఒక నివేదికలో అభిప్రాయ పడింది. డిసెంబర్ నెల తొలి పది రోజుల్లో ఆహార వస్తువుల ధరలు తక్కువగానే ఉన్నాయని, అందువల్ల మార్చి నాటికి ద్రవ్యోల్బణం 5 శాతానికి పరిమితం చేయాలన్న తన లక్ష్యాన్ని ఆర్‌బిఐ సులభంగా చేరుకోగలదని ఆ సంస్థ అభిప్రాయ పడింది. 2017 సంవత్సరం తొలి అర్ధ్భాగంలో సిపిఐ 5 శాతంకన్నా తక్కువే ఉండవచ్చని తాము భావిస్తున్నామని హెచ్‌ఎస్‌బిసి ఒక పరిశోధనా పత్రంలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం కారణంగా కూరగాయలులాంటి వివిధ ఆహార పదార్థాల పైన చేసే ఖర్చు తగ్గిపోవడంతో నవంబర్ నెలలో సిపిఐ రెండేళ్ల కనిష్టస్థాయి అయిన 3.63 శాతానికి పరిమితమైన విషయం తెలిసిందే. నోట్ల రద్దు కారణంగా చలామణిలో ఉండే నగదు భారీగా తగ్గిపోవడంతో నవంబర్ నెలలో ఆర్థిక కార్యకలాపాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని కూడా ఆ నివేదిక పేర్కొంది.