బిజినెస్

‘ఉడాన్’ పథకానికి వచ్చే నెలలో రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: పట్టణ ప్రాంతాలకు విమాన కనెక్టివీని కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉడాన్ పథకం కింద 190 రూట్ల కోసం 11 బిడ్డర్లనుంచి 43 ప్రాథమిక ప్రతిపాదనలు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఎఎఫ్)కు అందడంతో దేశంలో ఇప్పటివరకు విమాన సర్వీసులు లేని 43 విమానాశ్రయాలకు వచ్చే నెలనుంచి దశలవారీగా విమాన సర్వీసులు మొదలు కానున్నాయి. దేశంలోని వివిధ పట్టణాల్లో ప్రస్తుతం నిరుపయోగంగా పడి ఉన్న విమానాశ్రయాలను ఉపయోగంలోకి తేవడంతో పాటుగా పట్టణ ప్రాంతాలకు తక్కువ చార్జీలతో విమాన సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో ప్రవేపెడుతున్న ఉడాన్ పథకం కింద గంట సేపు ప్రయాణానికి రూ. 2,500లు చార్జీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, ఉడాన్ పథకం దేశీయ, ప్రాంతీయ ఏవియేషన్‌ను గణనీయంగా పెంచుతుందని గురువారం విలేఖరుల సమావేశంలో కేంద్ర పౌరవిమాన యాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. ఎయిర్‌పోర్టులకోసం మొదటి విడతగా వచ్చిన బిడ్డింగ్‌లను బట్టి చూసినట్లయితే ఉడాన్ పథకం దేశంలో విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకు రావడం ఖాయమనిపిస్తోందని మంత్రి చెప్పారు. ఇప్పుడు 75 విమానాశ్రయాలు పని చేస్తుండగా, ఈ పథకం ప్రారంభమయిన తర్వాత ఈ సంఖ్య 118కి పెరుగుతుందని ఆయన చెప్పారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్, పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బిహార్‌లాంటి పలు విమానాశ్రయాలు విమాన సర్వీసులు పూర్తి సిద్ధంగా ఉన్నందున ఉడాన్ పథకం కింద తొలి విమాన సర్వీసు ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సిన్హా చెప్పారు. ఫిబ్రవరి 3న రూట్లకు సంబంధించిన బిడ్లను ఖరారు చేస్తారు. మొత్తంమీద ప్రస్తుతం విమాన సర్వీసులు నడుస్తున్న 30 విమానాశ్రయాలను, ఇప్పటివరకు ఒక్క విమానం దిగని మరో 43 విమానాశ్రయాలను అనుసంధానం చేయడానికి 11 మంది బిడ్డర్లు ముందుకు వచ్చినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.