బిజినెస్

తగ్గనున్న పన్నులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: పెద్ద నోట్ల ఆకస్మిక రద్దు అనంతరం దేశంలో వివిధ రకాల వస్తువులకు డిమాండ్ గణనీయంగా తగ్గి ప్రభుత్వం సతమతమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే వారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌లో పన్నులను తగ్గించడం ద్వారా వస్తు వినిమయాన్ని పెంపొందించేందుకు తగిన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. అయితే మరికొద్ది నెలల్లో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలులోకి తీసుకురావాలని భావిస్తున్న వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వలన వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18)లో వసూలయ్యే పరోక్ష పన్ను వసూళ్లకు సంబంధించిన అంచనాలు ప్రభుత్వం వద్ద అందుబాటులో లేకపోవడంతో జైట్లీ ప్రస్తుతం ఎంతో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుందన్న అంచనాలను ఆధారంగా చేసుకుని ఆర్థిక శాఖ వివిధ సంక్షేమ పథకాలకు చేయాల్సిన ఖర్చులను సార్వత్రిక బడ్జెట్‌లో ప్రతిపాదించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత, కార్పొరేట్ పన్నులను గమనంలోకి తీసుకుని రూపొందించే ప్రత్యక్ష పన్ను వసూళ్ల అంచనాలు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి చాలా రోజుల ముందే ఆర్థిక మంత్రికి అందుబాటులో ఉంటాయి. అయితే వస్తు, సేవల పన్ను అమలు జూలై 1వ తేదీకి వాయిదా పడినందున వచ్చే ఆర్థిక సంవత్సరంలో వసూలయ్యే పరోక్ష పన్నులకు సంబంధించి ప్రస్తుతానికి విశ్వసనీయమైన అంచనాలేవీ ఆర్థిక మంత్రికి అందుబాటులో ఉండకపోవచ్చని పన్నుల రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. పరోక్ష పన్నుల్లోని ప్రధానమైన మూడు కాంపోనెంట్లలో (కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సేవా పన్నుల్లో) కస్టమ్స్ సుంకాల రూపంలో వసూలయ్యే ఆదాయంపై ప్రభుత్వానికి అంచనాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఎక్సైజ్, సేవా పన్నులను జిఎస్‌టిలో విలీనం చేసినందున వాటి వసూళ్లకు సంబంధించిన అంచనాలు ఇప్పట్లో అందుబాటులోకి రాకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.