బిజినెస్

పారిశ్రామిక ప్రగతి సారథులకు అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 27: పారిశ్రామిక రంగంలో అత్యంత ప్రతిభ కనబరచడంతోపాటు ప్రగతి పథంలో సాగుతున్న పలు కంపెనీలకు టైమ్ ఇండియా అవార్డులను ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా టైమ్ ఇండియా వైస్ చైర్మన్ నార్మన్ పెర్‌స్ట్రీన్, మెకినే్స కంపెనీ సీనియర్ పార్ట్‌నర్ రాజ్ థావన్‌లు సంయుక్తంగా ఈ అవార్డులను ప్రకటించారు. కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. 2017 సంవత్సరానికి మాన్యువేటర్ ఇన్నోవేటర్ అవార్డును మహీంద్ర అండ్ మహీంద్రాకు అందజేశారు. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగంలో భారత్ ఫోర్బ్స్‌కు అవార్డు లభించగా, ఎంఎస్‌ఎంఇలో ఫినిక్స్ సంస్థ అవార్డును దక్కించుకుంది. స్టార్టప్ ఇన్నోవేటర్స్ విభాగంలో బోరిక్ ఆగ్రోసైనె్సస్, స్టార్టప్ సస్టైనబిలిటీ పయోనీర్ విభాగంలో గ్రీన్‌వే గ్రామీణ్ ఇన్‌ఫ్రా, స్పెషల్ జ్యూరీ అవార్డులను పిటిసి ఇండస్ట్రీస్, వర్షాడ్రైవ్స్ దక్కించుకున్నాయి.