బిజినెస్

వచ్చే బడ్జెట్‌లో డిజిటలైజేషన్, ఆర్థిక సేవలకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: వచ్చే బడ్జెట్‌లో డిజిటలైజేషన్, ఆర్థిక సేవలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నట్లు పేటిఎమ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్‌ఒ) మధుర దేవ్ అన్నారు. వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్ ఉండగా, దేశంలో ఇంతవరకు బ్యాంకింగ్ రంగం పరిధిలో రాని వారిని నగదు రహిత లావాదేవీల పరిధిలోనికి తెచ్చేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందన్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, కమ్యూనిటీ సెంటర్లలో వైఫై సేవలను విస్తరించడం వల్ల డిజిటలైజేషన్ పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా, బడ్జెట్‌లో ఆదాయ పన్ను పరిమితి 2.50 లక్షల నుంచి 4 లక్షల రూపాయలకు పెంచుతారని, ఊరటనిచ్చే నిర్ణయాలుంటాయని సామాన్యులు, వేతన జీవులు ఆశిస్తున్నారు.