బిజినెస్

‘ఏపితో కలిసి పనిచేస్తాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 27: పారిశ్రామిక ప్రగతికి చోదక శక్తిగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రేలియన్ కాన్సల్ (దక్షిణ భారతదేశం) జనరల్ ప్రతినిధి సేన్ కెల్లీ స్పష్టం చేశారు. విశాఖలో శుక్రవారం ప్రారంభమైన భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే తమ వెస్ట్రన్ ఆస్ట్రేలియా రాష్ట్రం నుంచి పలు సంస్థలు ఏపిలో పరిశ్రమల స్థాపన, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన కుదుర్చుకున్నాయన్నారు. ముఖ్యంగా గనులు, వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత వాణిజ్యం, విశ్వవిద్యాలయాలు, వృత్తి నైపుణ్య కేంద్రాలు, పరస్పర సాంకేతిక సామర్థ్యం మార్పిడి తదితర అంశాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, వీటిని సమర్థవంతంగా వినియోగించుకునే క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర దేశాలతో కలిసి పనిచేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడారు.
ఏపితో కలిసి పనిచేసే విషయంలో నిరుడు భాగస్వామ్య సదస్సులో తాము కీలక ఒప్పందం చేసుకున్నామని గుర్తుచేశారు. ఏపితో వెస్ట్రన్ ఆస్ట్రేలియా రాష్ట్రం పరస్పర అవగాహనతో పనిచేయనున్నట్టు వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాల భాగస్వామ్యంతో మైనింగ్, విద్య, వ్యవసాయం ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. తద్వారా ఆర్థిక వృద్ధిరేటుతోపాటు రెండు రాష్ట్రాల్లోను ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందన్నారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా స్టేట్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ స్టీవ్ వుడ్ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో బంగారు గనుల తవ్వకం, శుద్ధి రంగాల్లో తమ సంస్థలు పెట్టుబడులు పెట్టాయన్నారు. మిగిలిన రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఏపిలో రెండోసారి జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో కనీసం నాలుగు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. సమావేశంలో ఆస్ట్రేలియా మైనింగ్ కంపెనీ ప్రతినిధి సెడ్రిక్ గూడే, హనుమ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న ఆస్ట్రేలియా ప్రతినిధులు