బిజినెస్

శ్రీసిటిలో రూ. 600 కోట్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, జనవరి 28: విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా సుమారు 600 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి 13 కంపెనీలు శనివారం శ్రీసిటితో ఒప్పందం చేసుకున్నాయి. శ్రీసిటి ఎండి రవీంద్ర సన్నారెడ్డి, ఆయా సంస్థల ప్రతినిధులు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వ్యాపారానికి అత్యంత అనువైన శ్రీసిటిలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి పిలుపు మేరకు స్పెయిన్ దేశానికి చెందిన వింటర్ రెన్యువబుల్ కంపెనీ 130 కోట్ల రూపాయలు, మన్‌బసంద్ 150 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాయ. కాగా, 13 సంస్థల్లో రెండు స్పెయిన్‌కు చెందినవైతే, ఒకటి దక్షిణ కొరియా దేశానికి చెందినది. మిగతావన్నీ కూడా స్వదేశీ సంస్థలే.పరిశ్రమలన్నీ ఇంజినీరింగ్, ఇంధనం, పారిశ్రామిక రసాయనాలు, పరిశోధన, వినిమయం వస్తువులు, లాజిస్టిక్స్, ఆహార వృద్ధి వివిధ ఉత్పత్తుల రంగానికి చెందినవి. ఈ ఒప్పందాల వల్ల దాదాపు 2 వేల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని అధికారులు తెలిపారు.

చిత్రం..విశాఖలో సిఎం సమక్షంలో అవగాహన ఒప్పందాల దృశ్యం