బిజినెస్

‘జన్‌ధన్’ దుర్వినియోగం స్వల్పమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 28: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మనీలాండరింగ్ కోసం మెజారిటీ జన్‌ధన్ ఖాతాలు దుర్వినియోగం అయ్యాయనడానికి ఆధారాలు లేవని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం అన్నారు. ‘నోట్ల రద్దు తరువాత అన్ని జన్‌ధన్ ఖాతాల ఆధారంగా మనీలాండరింగ్ జరిగిందనేందుకు ఆధారాలు లేవు. సుమారు 25 శాతం జన్‌ధన్ ఖాతాల్లో అంతకుముందు దాదాపు జమలు లేవు. జీరో బ్యాలెన్స్‌తో ఉన్నాయి. తరువాత వాటిల్లో సగటున 27 వేల రూపాయల చొప్పున నిల్వలున్నాయి’ అని ఆయన వివరించారు. కోల్‌కతా లిటరరీ మీట్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ కేవలం కొద్ది సంఖ్యలోనే జన్‌ధన్ ఖాతాలు మనీలాండరింగ్‌కు దోహదపడ్డాయని అన్నారు. తగిన ఏర్పాట్లు చేయకుండా నోట్ల చలామణిని ఉపసంహరించుకోవడాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న చిదంబంరం.. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పునరుద్ఘాటించారు. అపరిమితమైన పరిణామాలకు దారితీసే ఇలాంటి నిర్ణయాన్ని ఏక వ్యక్తి తీసుకోజాలరని కుడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని అత్యంత ముఖ్యమైన ముగ్గురు అధికారులైన ఆర్థిక కార్యదర్శి, బ్యాంకింగ్ కార్యదర్శి, ప్రధాన ఆర్థిక సలహాదారు.. గత 70 రోజుల్లో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది దేన్ని రుజువు చేస్తోంది? (నోట్ల రద్దు గురించి) వారిని సంప్రదించి అయినా ఉండి ఉండరు. లేదా ఒకవేళ సంప్రదించి ఉంటే, వారు విభేదించి ఉండి ఉంటారు’ అని ఆర్థిక వ్యవహారాల నిష్ణాతులలో ఒకరైన చిదంబరం విశే్లషించారు. ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ నోట్ల రద్దు అంశాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 5 పేజీల నోట్‌ను పంపించారని ఆయన ఆరోపించారు. దాని తర్వాతే కనీస మర్యాద పాటించకుండా రాజన్‌ను బయటికి పంపించారని చిదంబరం విమర్శించారు. అంటే నోట్లను రద్దు చేయాలన్న తొందరలో ప్రధాని ఉండినట్లు ఇది సూచిస్తోందని ఆయన పేర్కొన్నారు.
నోట్ల రద్దు వల్ల స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) కనీసం ఒక శాతం దెబ్బతిన్నట్టు తన అంచనాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) మంత్రిత్వ శాఖ పరిధిలోని 80 శాతం యూనిట్లు మూతపడ్డాయని ఆయన పేర్కొన్నారు. వాటి పునరుద్ధరణ జరగడానికి నెలలు కాదు, ఏళ్లు పడుతుందన్న ఆయన మార్కెట్‌లో నగదు కొరత తీరిందనే అభిప్రాయంతో విభేదించారు.