బిజినెస్

ఎల్‌అండ్‌టి లాభం రూ. 972 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టి) ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 39 శాతం పెరిగి 972 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 700.34 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సంస్థ వ్యాపారాన్ని ప్రభావితం చేసిందని, నగదు రహిత లావాదేవీలతో అమ్మకాల్లో స్తబ్ధత నెలకొందని, ఇప్పటికీ కోలుకోలేకపోతున్నామని శనివారం సంస్థ తెలిపింది. ఇదిలావుంటే ఆదాయం ఈసారి 26,286.98 కోట్ల రూపాయలుగా, పోయినసారి 25,928.07 కోట్ల రూపాయలుగా ఉంది. గతంతో పోల్చితే వ్యయం కూడా 24,170 కోట్ల రూపాయల నుంచి 24,486.57 కోట్ల రూపాయలకు పెరిగింది.