బిజినెస్

గూగుల్ ఉద్యోగులకు ట్రంప్ సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాన్‌ఫ్రాన్సిస్కో, జనవరి 28: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయంపై గూగుల్ భారత సంతతి సారథి సుందర్ పిచాయ్ విమర్శలు గుప్పించారు. ఏడు ముస్లీం దేశాల నుంచి అమెరికాకు వచ్చేవారిపై నిషేధం విధించడాన్ని తప్పుబట్టారు. ఇది అమెరికాకు వచ్చే నైపుణ్యానికి అడ్డుకట్ట వేస్తుందన్న ఆయన కనీసం 187 గూగుల్ ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని కూడా పిచాయ్ అన్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. మరోవైపు నిషేధిత దేశాల్లో పనిచేస్తున్న దాదాపు 100 మందిని గూగుల్ ఇప్పటికే వెనక్కి పిలిచినట్లు బిబిసి సైతం తెలియజేసింది. లేకపోతే అమెరికా ప్రవేశం వారికి దక్కదనే భయంతోనే గూగుల్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పింది.