బిజినెస్

ప్రతికూల పరిస్థితుల్లో ‘పెట్టుబడులు’ సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 29: రాష్ట్రంలో సుమారు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి విశాఖలో రెండు రోజులపాటు జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో పారిశ్రామికవేత్తలు ఎంఓయులు కుదుర్చుకున్నారు. నిరుడు సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయులు జరిగాయి. వెరసి, ఈ రెండేళ్లలో దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయులు జరిగాయన్నమాట. వీటిలో ఎంత వరకూ పెట్టుబడులు క్షేత్రస్థాయిలో సాకారం అవుతున్నాయన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకున్న పలుకుబడిని ఉపయోగించి, పారిశ్రామిక దిగ్గజాలను రప్పించి, పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు చేసుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, ప్రపంచ వాణిజ్య విపణి ప్రతికూల పరిస్థితుల్లో ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆశించినంతగా పెట్టుబడులు రావడానికి అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయన్నది ప్రధాన ప్రశ్న. నిరుడు జరిగిన నాలుగు లక్షల కోట్ల రూపాయల ఒప్పందాల్లో రెండు లక్షల కోట్ల వరకూ వచ్చాయని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఇందులో కొన్ని పరిశ్రమలు మాత్రమే పూర్తిస్థాయిలో గ్రౌండ్ అయ్యాయి. కొన్ని పరిశ్రమలు ఇంకా అనుమతుల స్థాయిలోనే ఉన్నాయి. నిరుడు విశాఖలో జరిగిన సిఐఐ సదస్సుకు అనిల్ అంబాని హాజరై డిఫెన్స్‌కు సంబంధించిన పరిశ్రమను ఐదు వేల కోట్ల రూపాయలతో విశాఖలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది రాలేదు. ఈ ఏడాది కూడా అనేకమంది పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. నిన్న మొన్నటి వరకూ ఏపికి ప్రత్యేక హోదా వస్తుందని, తద్వారా పారిశ్రామిక రాయితీలు లభిస్తాయని అనుకున్నారు. హోదా వచ్చినా రాయితీలు రావని తేలిపోవడంతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టే విషయంలో మళ్లీ పునరాలోచనలో పడుతున్నారు. రాయితీల విషయాన్ని పక్కనబెడితే, పరిశ్రమల స్థాపనకు కావల్సిన అనుమతులు చాలా సమస్యగా మారిపోయాయి. ఏపిలోని సముద్ర తీరంలో పరిశ్రమలు స్థాపించాలంటే కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సిఆర్‌జెడ్) అనుమతులు ఉండాలి. అలాగే పర్యావరణ అనుమతులు విధిగా ఉండాలి. ఇవి కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సి ఉంది. ఇందులో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. మరోపక్క ప్రభుత్వం కేటాయించిన భూములు వివాదాస్పదమై కోర్టుల వరకూ వెళ్తుండటం పెట్టుబడులకు ఆటంకంగా మారుతోంది.