బిజినెస్

నెల రోజుల్లో రూ. 5 వేల కోట్ల ఉపసంహరణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జన్ ధన్ ఖాతాల లావాదేవీలు భారీగా పెరిగినది తెలిసిందే. నోట్ల రద్దుకు ముందు జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాల్లో రద్దు తర్వాత వేలల్లో నగదు డిపాజిట్ అయ్యింది. మరికొన్ని ఖాతాల్లో నగదు నిల్వలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే ఇప్పుడు ఆ నగదంతా కూడా ఉపసంహరణ జరుగుతోంది. డిసెంబర్ 7 నుంచి నెల రోజుల్లోనే 5,582.83 కోట్ల రూపాయల నగదు విత్‌డ్రాలు జరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబర్ 7న జన్ ధన్ ఖాతాల్లోని నగదు విలువ 74,610 కోట్ల రూపాయలుగా ఉంటే, జనవరి 11న 69,027.17 కోట్ల రూపాయలకు పడిపోయింది. మొత్తం 26.68 కోట్ల జన్ ధన్ ఖాతాలున్నాయ. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినది విదితమే. రద్దయిన నోట్లను బ్యాంకు, పోస్ట్ఫాస్ ఖాతాల్లో డిపాజిట్ చేసుకుని, అంతే విలువైన కొత్త నోట్లను తీసుకోవచ్చని మోదీ చెప్పారు. దీంతో నిరుపేదలకు ఇచ్చిన జన్ ధన్ ఖాతాల్లోనూ విపరీతంగా డిపాజిట్లు జరిగాయి. దీన్ని గుర్తించిన ఆదాయ పన్ను శాఖ జన్ ధన్ లావాదేవీలపై కనే్నయగా, అక్రమార్కులు వీటిని వినియోగించుకుంటున్నట్లు తేలింది. దీనిపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుండగా, ఆర్‌బిఐ కూడా నవంబర్ 30 నుంచి జన్ ధన్ ఖాతాల నగదు ఉపసంహరణ పరిమితిని నెలకు 10 వేల రూపాయలకే పరిమితం చేసింది.