బిజినెస్

మైండ్‌ట్రీ లాభం రూ. 156 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: మధ్యశ్రేణి సాఫ్ట్‌వేర్ సర్వీసుల సంస్థ మైండ్‌ట్రీ ఏకీకృత నికర లాభం 21.2 శాతం పెరిగి గత ఆర్థిక సంవత్సరం (2015-16) నాలుగో త్రైమాసిక, ఈ ఏడాది జనవరి-మార్చిలో 156 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) ఇదే త్రైమాసికంలో 128.7 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఏకీకృత ఆదాయం 44.2 శాతం ఎగిసి 1,324.2 కోట్ల రూపాయలుగా ఉంది. పోయినసారి ఇది 918.1 కోట్ల రూపాయలుగా ఉంది. ఇదిలావుంటే మొత్తం 2015-16లో సంస్థ లాభం 12.5 శాతం వృద్ధితో 603.3 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం 31.7 శాతం పెరిగి 4,689.6 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు సోమవారం తెలియజేసింది.