బిజినెస్

అదనంగా రూ. 435 కోట్లు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 30: వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) లో ప్రస్తుత కేటాయింపుల కంటే అదనంగా 435 కోట్ల రూపాయలను కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడును కోరినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో సాంఘిక సంక్షేమ శాఖకు 2,309 కోట్ల రూపాయలు కేటాయించగా, ఇప్పటి వరకూ 61.5 శాతం ఖర్చు చేశామన్నారు. సాంఘిక గురుకుల పాఠశాలలకు అదనంగా 686 కోట్ల రూపాయలను కేటాయించాలని కోరానన్నారు. వసతి గృహాల్లో, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందచేసేందుకు వీలుగా మెస్ చార్జీలను పెంచాలని నిర్ణయించామన్నారు. 10 శాతం తక్కువ కాకుండా డైట్ చార్జీలను పెంచాలని ప్రతిపాదించామన్నారు. గిరిజన సంక్షేమానికి కూడా అదనంగా 388 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ దళితులు, గిరిజనుల అభివృద్ధికి ఏటా నిధుల కేటాయింపులను పెంచుతున్నట్లు తెలిపారు.