బిజినెస్

నల్లధన కుబేరులపై ఐటి కనె్నర్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: నల్లధన కుబేరులపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తూ ఆదాయ పన్ను శాఖ సోమవారం నూతన బినామీ చట్టం క్రింద 87 నోటీసులు ఇవ్వడమేగాక, కోట్లాది రూపాయల విలువైన బ్యాంక్ డిపాజిట్లను అటాచ్‌మెంట్ చేసింది. దేశవ్యాప్తంగా 42 కేసులకు సంబంధించి ఐటి శాఖ ఈ చర్యలకు దిగింది. బినామీ లావాదేవీల చట్టం ప్రకారం దోషులుగా తేలితే భారీ జరిమానాలతోపాటు గరిష్ఠంగా ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తారు. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఐటి శాఖ ఎప్పటికప్పుడు ప్రజలను హెచ్చరిస్తూనే ఉంది. అక్రమార్కులు తమ అవినీతి సంపదను అమాయకుల ఖాతాల్లో వేసి సక్రమ సొమ్ముగా మార్చుకుంటున్నట్లు తెలియడంతో ఐటి శాఖ అప్రమత్తమైంది.