బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెచ్‌డిఎఫ్‌సి
ముంబయి/న్యూఢిల్లీ, జనవరి 30: మార్ట్‌గేజ్ లెండర్ హెచ్‌డిఎఫ్‌సి ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 13 శాతం పెరిగి 2,728.66 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 2,419 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 14,981.41 కోట్ల రూపాయలుగా, పోయినసారి 12,253.9 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం సంస్థ స్పష్టం చేసింది. స్టాండలోన్ ఆధారంగా సంస్థ లాభం ఈసారి 1,701.21 కోట్ల రూపాయలుగా, నిరుడు 1,520.51 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా 7,268.44 కోట్ల రూపాయల నుంచి 8,137.18 కోట్ల రూపాయలకు ఎగిసింది.
టెక్ మహీంద్ర
దేశీయ ఐటిరంగ సంస్థ టెక్ మహీంద్ర ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తృతీయ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 14 శాతం పెరిగి 856 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 751.3 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా ఈసారి 12.7 శాతం ఎగిసి 7,557.5 కోట్ల రూపాయలుగా, నిరుడు 6,701.1 కోట్ల రూపాయలుగా నమోదైందని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు టెక్ మహీంద్ర సోమవారం తెలిపింది.
గ్రాసిమ్ ఇండస్ట్రీస్
ఆదిత్యా బిర్లా గ్రూప్ సంస్థ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల కాలంలో 13.69 శాతం పెరిగి 728.19 కోట్ల రూపాయలుగా, గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో 640.47 కోట్ల రూపాయలు గా ఉంది. ఏకీకృత ఆదాయం ఈసారి 9,577.02 కోట్ల రూపాయలుగా, పో యినసారి 9,496.84 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం తెలిపింది.
బజాజ్ ఫిన్‌సర్వ్
ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ బజాజ్ ఫిన్‌సర్వ్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 41 శాతం పుంజుకుని 614 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 437 కోట్ల రూపాయలకే పరిమితమైంది. ఆదాయం ఈసారి 6,834 కోట్ల రూపాయలుగా, నిరుడు 5,396 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం సంస్థ తెలిపింది.
బజాజ్ ఫైనాన్స్
బజాజ్ ఫైనాన్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తృతీయ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 36 శాతం పెరిగి 555.65 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 408.46 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 2,729.08 కోట్ల రూపాయలుగా, పోయనసారి 2,069.62 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం సంస్థ ప్రకటించింది.
జిసిపిఎల్
గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (జిసిపిఎల్) ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 351.78 కోట్ల రూపాయలుగా, గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో 367.75 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 2,485.77 కోట్ల రూపాయలుగా, పోయనసారి 2,285.74 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం సంస్థ తెలియజేసింది.
శ్రీ సిమెంట్ లిమిటెడ్
శ్రీ సిమెంట్ లిమిటెడ్ స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తృతీయ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 235.45 కోట్ల రూపాయలుగా, గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో 233.75 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 2,091.17 కోట్ల రూపాయలుగా, నిరుడు 2,025.49 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం తెలిపింది.