బిజినెస్

పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: ప్రభుత్వరంగ సంస్థ, భారతీయ తపాలా శాఖకు చెందిన పేమెంట్స్ బ్యాంక్ సోమవారం తమ కార్యకలాపాలను ప్రారంభించింది. రాయ్‌పూర్‌లో పైలట్ సర్వీసులను పరిచయం చేయగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 650 శాఖలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక 25,000 రూపాయల వరకు డిపాజిట్లపై 4.5 శాతం వడ్డీని, 25-50,000 రూపాయల వరకు డిపాజిట్లపై 5 శాతం వడ్డీని, 50-లక్ష రూపాయల వరకు డిపాజిట్లపై 5.5 శాతం వడ్డీని ఇస్తామని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) సిఇఒ ఎపి సింగ్ తెలిపారు. ఎయిర్‌టెల్ తర్వాత పేమెంట్స్ బ్యాంక్ సేవలను తెచ్చినది ఐపిపిబినే. 3,000 కోట్ల రూపాయలతో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు మొదలైయ్యాయ. మరోవైపు దాదాపు 400 కోట్ల రూపాయలతో పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు ప్రారంభం కానున్నాయ.

చిత్రం..ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పైలట్ సేవలను సోమవారం న్యూఢిల్లీలో ప్రారంభిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ (మధ్యలో) తదితరులు