బిజినెస్

ఇక ఉబర్ బైక్ షేరింగ్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: ట్యాక్సీ సేవల సంస్థ ఉబర్ క్యాబ్.. హైదరాబాద్‌లో ఇప్పుడు బైక్ షేరింగ్ సేవలను మొదలుపెట్టింది. ఉబర్‌మోటో పేరిట ఈ సేవలను సోమవారం పరిచయం చేసింది. గత నెల డిసెంబర్‌లోనే ఈ సేవలను టి-హబ్‌లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ఉబర్ ప్రకటించింది. తెలంగాణ ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి కెటిఆర్ సమక్షంలో సంస్థ వ్యవస్థాపక సిఇఒ ట్రవిస్ కలనిక్ ఈ ప్రకటన చేశారు. కాగా, ట్రాఫిక్ అధికంగా ఉండే హైదరాబాద్ వాసులు ఇక మరింత వేగంగా తమ గమ్యస్థానాన్ని చేరవచ్చని, ఈ సేవలు వారికి ఎంతగానో ఉపయోగపడగలవన్న ఆశాభావాన్ని కలనిక్ వ్యక్తం చేశారు.