బిజినెస్

వేసవిలో అపరాల సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 31: రాష్ట్రంలో అపరాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి మూడో పంటగా వేసవిలో అపరాల సాగుపై ప్రత్యేక దృష్టిసారించామని, ఇందుకోసం మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళిక చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ కె ధనుంజయరెడ్డి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం రాష్టస్థ్రాయి వేసవి అసరాల సాగుపై కార్యాచరణ ప్రణాళిక సదస్సు నిర్వహించారు. దీనికి హాజరైన ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కంది పంటను ప్రోత్సహించడంలో భాగంగా తీసుకున్న చర్యలవల్ల రాష్ట్రంలో విపరీతమైన దిగుబడి లభించిందన్నారు. దిగుబడి తక్కువ, వినియోగం ఎక్కువగా ఉండటంవల్ల అపరాల సాగును విస్తరిస్తున్నామని తెలిపారు. కంది పంటకు ప్రభుత్వం కనీస మద్ధతు ధరగా క్వింటాలుకు 4,550 రూపాయలు, బోనస్‌గా మరో 500 రూపాయలు వెరసి 5,050 రూపాయలను చెల్లిస్తోందని పేర్కొన్నారు. కాగా, అనంతపురం, కడప జిల్లాల్లో అత్యధికంగా దిగుబడి వచ్చిందని, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి కంది పంటను కొనుగోలు చేస్తున్నామన్నారు. ముందుగా అనంతపురం, కడప జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, పంట దిగుబడి సమయాన్ని బట్టి అన్ని జిల్లాల్లో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రబీలో కృష్ణా, ఉభయ గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో 4 లక్షల హెక్టార్లలో మినుము, 2 లక్షల హెక్టార్లలో పెసర వేశారని, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మూడవ పంటగా రబీ నుంచి వేసవి అపరాల సాగు విస్తృతంగా చేపడుతున్నామని ధనుంజయరెడ్డి తెలిపారు. 2.30 లక్షల హెక్టార్లలో సాగు చేపట్టడానికి మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళిక చేపట్టామని, వేసవి అపరాల సాగును విస్తృతపర్చడానికి 33 శాతం విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేస్తున్నామని, ఆయిల్ ఇంజన్లు, వాటర్ క్యాన్లు, పురుగుల మందులు తదితరాలన్నీ రైతులకు సబ్సిడీపై అందించడానికి బడ్జెట్ పెంచామన్నారు. రైతులు ఉత్తమ యాజమాన్య పద్ధతులు అవలంభించేలా, తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగుకు జల వనరుల శాఖ, వ్యవసాయ శాఖలు సమన్వయంగా కృషిచేస్తున్నాయని కొనియాడారు. ఖరీఫ్, రబీ సకాలంలో పూర్తయితే మూడో పంటగా కేవలం 80 నుంచి 85 రోజుల్లో చేతికొచ్చేలా వేసవి అపరాల సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు. పట్టిసీమవల్ల కృష్ణాలో కూడా త్వరితగతిన పంట చేతికొచ్చిందన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా 27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేశామని, కోస్తా నేలల్లో పరిచయమైన ఆర్‌సి బయో అనే కొత్త వరి వంగడం కొన్నిచోట్ల కేళీలు వచ్చాయని, దీంతో రైతులు నష్టపోయారని చెప్పారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశామని, ఒకవేళ ఆ కంపెనీ ఇవ్వకపోతే ఎపి సీడ్స్ సంస్థ సరఫరా చేసినందున, ఆ సంస్థ నుంచి రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని మినహాయంచి మిగిలిన మొత్తాన్ని మాత్రమే విత్తన బిల్లుగా చెల్లిస్తామని ధనుంజయరెడ్డి స్పష్టం చేశారు. కాగా, మినుము పంటలో తల మాగుడు తెగులు వైరస్ వ్యాపించిందని, దీని నివారణకు చర్యలు చేపట్టామన్నారు. కృష్ణాలో 1.45 లక్షల హెక్టార్లలో వ్యాపించిందన్నారు. ఇక ఈశాన్య రుతుపవనాల్లో 72 శాతం వర్షంపాతం లోటు వల్ల రాయలసీమ జిల్లాల్లో మూడున్నర లక్షల హెక్టార్లలో రబీ వేయలేకపోయారని ధనుంజయరెడ్డి తెలిపారు.