బిజినెస్

18 లక్షల మందివి అనుమానిత డిపాజిట్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా 18 లక్షల మంది అనుమానిత డిపాజిట్లను కలిగి ఉన్నట్లు గుర్తించింది ఆదాయ పన్ను శాఖ. వీరిలో కొందరి డిపాజిట్ల విలువ 5 లక్షల రూపాయల పైమాటేనని తెలిపింది. ఈ సొమ్ము ఈ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఈ-మెయిల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌ల ద్వారా వివరణ కోరామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సిబిడిటి) చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. ఆదాయ పన్ను శాఖ నోటీసులు లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యల నుంచి తప్పించుకోవాలంటే 10 రోజుల్లోగా సమాధానమివ్వాలని చెప్పారు. వారివారి సమాధానాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు.