బిజినెస్

‘బలమైన ఆర్థిక మూలాలతో నిలకడైన వృద్ధిరేటు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: బలమైన స్థూల ఆర్థిక మూలాలతో నిలకడైన వృద్ధిరేటు సాధ్యమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి మాట్లాడుతూ పన్ను ఎగవేతల అడ్డుకట్టకు, నల్లధన నిర్మూలనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను వెలుగు రేఖగా అభివర్ణించిన ఆయన 2014 నుంచి దిగివస్తున్న కరెంట్ ఖాతా లోటు, తగ్గుతున్న రుణ భారం, అదుపులోకి వస్తున్న ద్రవ్యోల్బణం.. విపత్కర పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయన్నారు. మరోవైపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు స్థాయకి చేరుకున్నాయని గుర్తుచేశారు.