బిజినెస్

బడ్జెట్‌లో సంస్కరణలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: నేడు దేశ ఆర్థిక వ్యవస్థ ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటోందో ఆర్థిక సర్వే స్పష్టంగా చెప్పిందని పారిశ్రామిక, వ్యాపార రంగాలు అభిప్రాయపడ్డాయి. మంగళవారం విడుదలైన ఆర్థిక సర్వే నేపథ్యంలో బుధవారం ప్రకటించే బడ్జెట్ సంస్కరణాత్మకంగా ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను జిడిపి వృద్ధిరేటు 6.75-7.5 శాతం ఉండగలదన్న అంచనాను అందుకోవచ్చన్న విశ్వాసాన్నీ కనబరిచాయి. ‘బడ్జెట్‌లో సాహసోపేతమైన నిర్ణయాలు, సంస్కరణలు ఉంటాయన్న సంకేతాలను తాజా ఆర్థిక సర్వే ఇచ్చింది. ముఖ్యంగా వౌలిక రంగం, ఉద్యోగ, ఉపాధి కల్పన, వ్యాపార నిర్వహణ సులభతరం వంటి వాటిపై బడ్జెట్ దృష్టి పెడుతుందని అనిపిస్తోంది. బ్యాంకింగ్ రంగాన్ని.. ప్రధానంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిల (ఎన్‌పిఎ లేదా నిరర్థక ఆస్తులు) సమస్య పరిష్కారం దిశగా చర్యలుంటాయని భావిస్తున్నాం. అలాగే ప్రభుత్వ-ప్రైవేట్‌రంగ భాగస్వామ్యం (పిపిపి)తో నడిచే ప్రాజెక్టుల లైన్‌క్లియర్‌కూ బడ్జెట్ దోహదపడగలదని అనిపిస్తోంది.’ అని కెపిఎమ్‌జి ఇండియా సిఇఒ రిచర్డ్ రెఖీ అన్నారు. వ్యక్తిగత, కార్పోరేట్ ఆదాయ పన్నులను తగ్గించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ‘దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే విపత్కర పరిణామాలను ఆర్థిక సర్వే సరిగ్గా అంచనా వేసింది. అధిక చమురు ధరలు, వాణిజ్యపరమైన ఆందోళనలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. దీనే్న ఆర్థిక సర్వే స్పష్టంగా చెప్పింది. కరెన్సీ ఒడిదుడుకులు, భౌగోళిక, రాజకీయ కారణాలు ఆర్థికపరమైన ఇబ్బందులను సృష్టిస్తున్నాయి.’ అని అసోచామ్ అధ్యక్షుడు సునీల్ కనోరియా అన్నారు. పన్నుల భారం తగ్గవచ్చన్న అంచనాను సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వెలిబుచ్చారు. ఈసారి బడ్జెట్‌లో అధిక పన్నుల నుంచి ఉపశమనం లభించగలదన్న ఆశాభావాన్ని ఫిక్కీ అధ్యక్షుడు పంకజ్ పటేల్ వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16) భారత జిడిపి వృద్ధిరేటు 7.6 శాతంగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ఇది 6.5 శాతానికే పరిమితం కాగలదని తాజా ఆర్థిక సర్వే అంచనా వేసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) దేశ జిడిపి వృద్ధిరేటు 6.75-7.5 శాతం మధ్య నమోదు కాగలదన్న విశ్వాసాన్ని కనబరిచింది. మొత్తానికి దేశ వృద్ధిరేటుకు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయన్న విశే్లషణలు ఆర్థిక సర్వే ఆధారంగా వ్యక్తమయ్యాయి.
తగ్గుతున్న ‘రియల్’ ధరలు
పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. నోట్ల రద్దు వెనకగల ప్రభుత్వ లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి అని ఆయన తెలిపారు. మంగళవారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఈ సర్వేలో డిమానిటైజేషన్.. ఇండ్ల ధరలను సామాన్యులకు అనుకూలంగా చేసిందన్న అభిప్రాయాన్న సుబ్రమణ్యన్ వెలిబుచ్చారు. తగ్గిన బ్యాంక్ వడ్డీరేట్లు గృహ రుణాల భారాన్ని దించాయని పేర్కొన్నారు. నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. అయతే రద్దయన నోట్లను బ్యాంకులు, పోస్టాఫీసు ఖాతాల్లో డిపాజిట్ చేసుకుని కొత్తగా పరిచయం చేసిన 500, 2,000 రూపాయల నోట్లను పొందవచ్చని కూడా మోదీ తెలిపారు.