బిజినెస్

ఏప్రిల్ 1 నుంచి గార్, పోయెమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: జనరల్ యాంటి-అవాయిడెన్స్ రూల్స్ (గార్), ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్‌మెంట్ (పోయెమ్) ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) ఆరంభం నుంచి గార్, పోయెమ్ అమలవుతాయని గురువారం ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశీ సంస్థలు భారత్‌లో పన్నులు కట్టేలా పోయెమ్ ఉంటుంది. అలాగే పన్నుల నుంచి తప్పించుకోవడానికి ఇతర దేశాల ద్వారా సంస్థలు చేసే ప్రయత్నాలను గార్ నిరోధిస్తుంది. గార్ అమలు గత ఐదేళ్లుగా వాయిదా పడుతోంది. ఎట్టకేలకు మోదీ సర్కారు దీన్ని అమల్లోకి తెస్తోంది.