బిజినెస్

‘జియో టారిఫ్‌లు సహేతుకమే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ టారిఫ్ ప్లాన్లు సహేతుకమేనని, నిబంధనలకు లోబడే ఉన్నాయని టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ స్పష్టం చేసింది. ప్రస్తుత టారీఫ్ ఆర్డర్లకు అనుగుణంగానే జియో ఆఫర్లు కొనసాగుతున్నాయని చెప్పింది. జియో ఉచిత 4జి ఆఫర్లపై భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్‌లు టెలికామ్ ట్రిబ్యునల్ టిడిశాట్‌ను ఆశ్రయించినది తెలిసిందే. ట్రాయ్ తీరుపైనా సదరు సంస్థలు అసంతృప్తిని వ్యక్తం చేస్తుండగా, ఈ నేపథ్యంలో ట్రాయ్ తాజా ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.