బిజినెస్

హైదరాబాద్‌లో మెర్క్యూర్ హోటల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: హైదరాబాద్‌లో మెర్క్యూర్ హోటల్ ప్రారంభమైంది. ఈ లగ్జరీ హోటల్ బ్రాండ్.. ఫ్రాన్స్ బహుళజాతి సంస్థ ఎకార్ హోటల్స్‌కు చెందినదవగా, సోమాజిగూడలో మెర్క్యూర్ హైదరాబాద్ కెసిపి పేరిట అత్యంత విలాసవంతమైన సేవలను ఎకార్ అందించనుంది. 128 గదులు, మూడు ఫుడ్, బేవరేజెస్ ఔట్‌లెట్లు, సౌకర్యవంతమైన మీటింగ్, బంక్విట్ హాల్స్ ఇందులో ఉన్నాయని కెసిపి లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కవితా దత్ చిట్టూరి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐటి, ఫార్మా రంగంలోని ప్రముఖ సంస్థలు ప్రస్తుతం హైదరాబాద్‌లో తమ శాఖలను విస్తృతంగా ప్రారంభిస్తున్న నేపథ్యంలో వారి స్థాయికి తగ్గ హోటల్‌ను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో తాము ఈ మెర్క్యూర్ హైదరాబాద్ కెసిపిని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. మెర్క్యూర్ హైదరాబాద్ కెసిపి జనరల్ మేనేజర్ దినేష్ రాయ్ మాట్లాడుతూ తమ హోటల్‌లో సుపీరియర్, డీలక్స్, సుపీరియర్ లేక్ ఫేసింగ్ రూమ్స్, సూట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హోట ల్ ప్రారంభం సందర్భంగా ఆఫర్లను కూడా అందిస్తున్నామని చెప్పారు.