బిజినెస్

బడ్జెట్‌తో జిడిపి పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: కేంద్ర బడ్జెట్‌తో ఇంతకాలం పన్ను చెల్లించేందుకు ఆసక్తి చూపనివారిపై కొరఢా ఝుళిపించినట్లుగా ప్రతిపాదనలు ఉన్నాయని, నల్లధనం నిర్మూలన దిశగా బడ్జెట్ ఉందని పెగా సిస్టమ్స్ ఎండి సుమన్ రెడ్డి అన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన స్వాగతించారు. వచ్చే మూడు సంవత్సరాల్లో దేశంలో 20 వేల స్టార్టప్‌లు రానున్నాయని, వీటికి మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. డిజిటల్ ఎకానమీ వైపు దేశం పరుగులు తీసే విధంగా ఉందన్నారు. ఆర్థిక సంస్కరణలు వేగవంతమవుతాయని, దేశ వ్యాప్తంగా యువతకు డిజిటల్ తదితర టెక్నాలజీ అంశాలపై శిక్షణ ఇవ్వాలన్నారు. భారత్ ఫోర్జ్ ఎండి బాబా కళ్యాణి మాట్లాడుతూ అంతర్జాతీయంగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో కేంద్ర బడ్జెట్ దేశాన్ని సరైన దారిలో నడిపించే విధంగా ఉందన్నారు. ఇది ముమ్మాటికి అభివృద్ధి బడ్జెట్ అన్నారు. పన్ను చెల్లింపుదార్లకు ఊరట కల్పించే చర్యలు తీసుకున్నారని, పరిశ్రమలకు పన్ను రాయితీలు కల్పించారని ఆయన స్వాగతించారు. ఆర్థిక లోటును 3.2 శాతం వద్దనే ఉంచారని ఇది వాస్తవిక దృష్టితో రూపొందించిన బడ్జెట్ కొనియాడారు. టిఫ్యాప్సీలో జరిగిన కార్యక్రమంలో పరోక్ష పన్నుల కమిటీ చైర్మన్ జెఎస్ కరుణేంద్ర మాట్లాడుతూ కొత్త బడ్జెట్‌లో జిఎస్‌టి అమలు తేదీని ప్రకటించలేదన్నారు. కొత్తతరహా పరోక్ష పన్నుల విధానం అమలుకు వీలుగా వాణిజ్య రంగం సాఫ్ట్‌వేర్‌ను మార్చుకునేందుకు తగిన సమయం ఉందన్నారు. డెలాయిట్ భాగస్వామి గణేష్ బాలకృష్ణన్ మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్ ప్రవేశపెట్టడం, యూనియన్ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయడం, ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చులకు స్వస్తి చెప్పి కొత్త బడ్జెట్ విధానాన్ని అమలు చేయడం మంచి పరిణామమన్నారు.

చిత్రం..పెగా సిస్టమ్స్ ప్రతినిధి