బిజినెస్

ఆపరేషన్ క్లీన్ మనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/హైదరాబాద్, ఫిబ్రవరి 2: ఆదాయ పన్ను శాఖ.. ఆపరేషన్ క్లీన్‌మనీ కార్యక్రమాన్ని ప్రారంభించింది.పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జరిగిన నగదు డిపాజిట్లలో సుమారు 4.17 లక్షల కోట్ల రూపాయల విలువైన అనుమానిత లావాదేవీలను ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. దాదాపు 18 లక్షల మంది ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు తెలియరాగా, వీరిలో 13 లక్షల మందికి ఎస్‌ఎమ్‌ఎస్, ఈ-మెయల్‌లను పంపించినట్లు ఢిల్లీలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) చైర్మన్ సుశీల్ చంద్ర గురువారం తెలిపారు. కాగా, నిరుడు నవంబర్ 9వ తేదీ నుండి డిసెంబర్ 30వ తేదీ వరకూ బ్యాంకుల వద్దకు వచ్చిన భారీ నగదు డిపాజిట్లను, ఇ-వెరిఫికేషన్ పద్ధతిలో సరిచూడనున్నారు.
మరోవైపు ఆన్‌లైన్ ద్వారా వెరిఫికేషన్ జరిగిన కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఇన్‌కమ్‌టాక్స్ పోర్టల్‌లో పిఎఎన్ హోల్డర్ ఇ-ఫైలింగ్ విండోలో లభ్యం అయ్యేలా ఉంచామని అధికారులు పేర్కొన్నారు. పాన్ హోల్డర్ పోర్టల్‌లోని కాంప్లియన్స్ విభాగంలోని క్యాష్ ట్రాన్జక్షన్ 2016ను ఉపయోగించి సమాచారాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉందని వారు వివరించారు. ఐటి పోర్టల్‌లో ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో అన్ని అనుమానాలకు సమాధానాలు అందుబాటులో ఉన్నాయని, వెరిఫికేషన్ అనంతరం సమాధానాలను సైతం ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సి ఉంటుందని, అనంతరం పోర్టల్‌లో అప్‌డేట్ చేస్తామని చెప్పారు.
జిఎస్‌టి మైగ్రేషన్ కేంద్రం ఏర్పాటు
కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ హైదరాబాద్ జోన్ చీఫ్ కమిషనర్ సందీప్ ఎం భట్నాగర్ హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని కేంద్రీయ శుల్క్ భవన్‌లో జిఎస్‌టి మైగ్రేషన్ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. మదుపరులకు వస్తు, సేవల పన్నుపై అనుభవం ఉన్న అధికారులు మార్గదర్శనం చేస్తారని అనుమానం ఉన్న వారు 040-23231821కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని చెప్పారు.
పదేళ్ల చరిత్రను తిరగదోడుతున్నారు
మరోవైపు నల్లధనానికి అడ్డుకట్ట, దాని వెలికితీతలో భాగంగా ఆదాయ పన్ను శాఖ అధికారులు.. పన్ను చెల్లింపుదారులందరి ఆదాయ పన్ను రిటర్న్స్‌ను గడచిన పదేళ్ల కాలం నుంచి గమనిస్తున్నారు. లెక్కలు చూపని డిపాజిట్లు లేదా 50 లక్షల రూపాయలకు మించి ఆస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. బుధవారం కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ ఈ దిశగా అడుగులు వేస్తోంది.
మార్చికల్లా ఐటి రిటర్న్స్ దాఖలవ్వాల్సిందే
ఇదిలావుంటే ఐటి రిటర్న్స్ దాఖలు మార్చి చివరికల్లా తప్పక జరగాల్సిందే. అలా జరగనిపక్షంలో జరిమానా తప్పదు. 5 లక్షల రూపాయల దిగువన ఆదాయమున్నవారు వెయ్య రూపాయలు, 5 లక్షలు దాటినవారు 5 వేల రూపాయల జరిమానాతో డిసెంబర్ 31లోగా చెల్లించేందుకు వెసులుబాటు లభిస్తుంది. ఆ తర్వాత చెల్లింపులు జరిపేవారికి 10 వేల రూపాయల జరిమానా తప్పదు. ఇది 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు కానుంది.