బిజినెస్

కెజి బేసిన్‌లో షేల్ గ్యాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 2: భారత చమురు, సహజవాయు సంస్థ (ఒఎన్‌జిసి) రాతి పొరల నుంచి లభించే షేల్ గ్యాస్‌ను వెలికితీసే సాంకేతికతను అనుసంధానం చేసుకుంది. ఇప్పటివరకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే అందుబాటులో ఉన్న ఈ టెక్నాలజీని ప్రస్తుతం ఒఎన్‌జిసి సొంతం చేసుకుంది. ఆన్‌షోర్ (్భమిపై)కే పరిమితమైన ఈ సాంకేతికతను వినియోగించి, షేల్ గ్యాస్‌ను వెలికితీసే ప్రక్రియకు మొట్టమొదటిసారిగా కృష్ణా-గోదావరి (కెజి) బేసిన్‌లో శ్రీకారం చుట్టింది. భూమి గర్భంలోని రాతి పొరల్లో సుమారు 4 కిలోమీటర్ల లోతులో ఈ షేల్ గ్యాస్ కోసం అనే్వషణ, వెలికితీత ప్రక్రియకు కసరత్తు చేపట్టింది.
కెజి బేసిన్ పరిధిలోని పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు, కృష్ణా జిల్లాలో రెండు, తూర్పు గోదావరి జిల్లాలో ఒక ప్రాజెక్టు వెరసి ఐదు షేల్ గ్యాస్ ప్రాజెక్టులను 217 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒఎన్‌జిసి చేపట్టింది. ఇందులో మొదటిసారిగా తూర్పు గోదావరి జిల్లాలోని ఆలమూరు మండలం కల్వచర్ల గ్రామం వద్ద ఎంజిఎస్‌జిఎ అనే సైట్‌లో 44 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నారు.
షేల్ గ్యాస్ అంటే: భూ గర్భంలోని బంకమట్టి రాళ్ళ నుంచి సేకరించే గ్యాస్‌ను షేల్ గ్యాస్ అంటారు. ఇందులో గ్యాస్, చమురు కూడా ఉంటాయి. ఇప్పటివరకు గ్యాస్, చమురును సున్నపు రాయి పొరల నుంచి అనే్వషిస్తున్నారు. ఇపుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బంక మట్టి రాళ్ల నుంచి కూడా చమురు, సహజ వాయువును సేకరించే సాంకేతికత ఒఎన్‌జిసికి అందుబాటులోకి వచ్చింది.
అమెరికా వంటి దేశాల్లో కూడా ఈ టెక్నాలజీ దాదాపు గత ఐదారేళ్ల నుంచే వినియోగిస్తున్నారు. వాస్తవానికి ఈ టెక్నాలజీ అందుబాటులోకి రాక ముందు అమెరికా చమురు, సహజ వాయువులను దిగుమతి చేసుకునే పరిస్థితిలో ఉండేది. ఇపుడు మాత్రం స్వయంసమృద్ధి సాధించింది.
ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడం గమనార్హం. ఇంకో మాటలో చెప్పాలంటే అమెరికాలో డాలర్ ధర పెరిగిందంటే ఈ షేల్ గ్యాస్ వల్లేనని చెప్పొచ్చు. భూమి ఉపరితలం నుంచి 35 కిలో మీటర్ల లోతు వరకున్న క్లస్టర్ వరకే వివిధ పొరల్లో ఖనిజాలు తదితరాలు ఉంటాయి. ఇందులో దాదాపు 500 మీటర్ల వరకు నీటి జాడలు ఉంటాయి. ఇటువంటి పొరలన్నీ దాటుకుని నాలుగు కిలోమీటర్ల లోతులోగల బంకమట్టి రాళ్ల నుంచి ఈ షేల్ గ్యాస్‌ను ఒఎన్‌జిసి వెలికి తీయనుంది. పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డి) ప్రాజెక్టులో భాగంగా ఒఎన్‌జిసి 44 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తూ మొదటి సారిగా ఈ షేల్ గ్యాస్ ప్రాజెక్టును తూర్పు గోదావరి జిల్లాలో చేపట్టింది.
కాగా, షేల్ గ్యాస్ అనే్వషణల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఒఎన్‌జిసి ఒక అధ్యయన కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదికల్లో కూడా భూమి పొరల్లో ఎటువంటి తేడాలు లేవని తేటతెల్లమైంది. అదేవిధంగా ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో డెల్టా అధ్యయన కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ అధ్యయనంలో ఇటు డ్రిల్లింగ్ జరుగుతున్న ప్రాంతాల్లోనూ, డ్రిల్లింగ్‌కు దూరంగా ఉన్న ప్రాంతాల్లోనూ భూమి పొరల్లో ఏమైనా వ్యత్యాసాలు పొడచూపుతున్నాయా అనే దాన్ని పరిశీలిస్తున్నారు.
అయితే ఇప్పటివరకు ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదని నిర్ధారణ జరిగింది. ఏదేమైనప్పటికీ అత్యాధునిక సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానంతో ఒఎన్‌జిసి వెలికితీయనున్న ఈ షేల్ గ్యాస్‌ను కార్పొరేట్ సంస్థలు తన్నుకుపోయే పరిస్థితి కూడా పొంచి ఉందని తెలుస్తోంది. గతానుభవాలను బట్టి చూస్తే కష్టం ఒఎన్‌జిసిది... ఫలితం కార్పొరేట్ సంస్థలదన్నట్టుగా కనిపిస్తోంది. అటువంటి పరిస్థితి లేకుండా షేల్ గ్యాస్‌ను కాపాడుకోవాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కాగా, షేల్ గ్యాస్ వెలికితీత విజయవంతమైతే దేశ గ్యాస్ అవసరాలకు ఢోకా లేదన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయ.

చిత్రం..డ్రిల్లింగ్ వెల్ నమూనా, భూమి పొరల్లో షేల్ గ్యాస్ లభించే రాతిపొర రేఖాచిత్రం