బిజినెస్

మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 4: ‘మా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులు పెట్టండి..’ అని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల, వౌలిక సదుపాయాల సంస్థ (టిఎస్‌ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. బాల మల్లు నేతృత్వంలో శనివారం తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఐఎఫ్) ప్రతినిధుల బృందం హర్యానా, రాజస్థాన్‌లో పర్యటించింది. అక్కడి మానెవర్, నిమ్‌రాన్ ఇండస్ట్రియల్ పార్కులను సందర్శించింది. ఈ రెండు పార్కులను ఏ విధంగా అభివృద్ధి చేశారు?, ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఎటువంటి వౌలిక సదుపాయాలను, ఇతర సౌకర్యాలను కల్పించారన్న అంశాలపై తెలంగాణ పారిశ్రామిక వేత్తల బృందం సభ్యులు అధ్యయనం చేశారు. పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య కారకాలను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలు గురించి కూడా వారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలమల్లు అక్కడి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తమ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన నూతన పారిశ్రామిక పాలసీ (టిఎస్-ఐపాస్) ద్వారా కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులను ప్రభుత్వమే పారిశ్రామికవేత్తలకు అందజేస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పరిశ్రమల స్థాపనకు సబ్సిడీలను అందిస్తున్నదని చెప్పారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఉందని, తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. తెలంగాణలో కొత్త పారిశ్రామిక వాడలను అంతర్జాతీయ, అత్యాధునిక ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం దేశంలోని మాడల్ ఇండస్ట్రియల్ పార్కులను అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. మాడల్ ఇండస్ట్రియల్ పార్కుల్లో అందుబాటులో ఉన్న ఆధునిక వసతులను, సౌకర్యాలను పరిశీలించి వాటిని తెలంగాణలో ఏర్పాటు చేయబోయే పారిశ్రామిక వాడల్లో అందుబాటులోకి తీసుకుని వస్తామని ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లా తడలో శ్రీసిటీ సెజ్‌ను ఇప్పటికే సందర్శించామని వివరించారు. హైదరాబాద్ నగర శివారులోని దండుమైలారం పారిశ్రామిక వాడను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇంకా ఈ బృందంలో తెలంగాణ సివిల్ సప్లయి కార్పోరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, టిఐఎఫ్ అధ్యక్షుడు సుధీర్ రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు రఘు, టిఐఎఫ్ సలహాదారు రాకేష్ మారుపాక, జాయింట్ సెక్రటరీ గోపాల్ రావు, సభ్యులు జలంధర్ రెడ్డి, వై సుధాకర్ రెడ్డి, టిఆర్‌ఎస్ సీనియర్ నేతలు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గుడాల భాస్కర్ తదితరులు ఉన్నారు.

చిత్రం..హర్యానా, రాజస్థాన్‌లలో పర్యటించిన టిఐఎఫ్ ప్రతినిధుల బృందం